- గతంలో సంక్షేమ పథకాలపైనా ఆరా
- 1.10 కోట్ల కుటుంబాల నుంచి వివరాలు సేకరణ
- 3 వేలకుపైగా సిబ్బంది
- 15 రోజులు క్షేత్రస్థాయి సర్వే
- ఆ తర్వాత నివేదికలు
- ఈ నెలాఖరులోగా కుల గణన సర్వేకు వెళ్లేందుకు అవకాశం
ముద్ర, తెలంగాణ బ్యూరో:- రాష్ట్ర ప్రభుత్వం కుల గణనకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఉన్న జనాభా ఆధారంగా ఏ కులం జనాభా సంఖ్య ఎంత ఉంది? వారికి అందుతున్న సంక్షేమ పథకాలు…..ఇంకా అందించాల్సిన పథకాలు ఏమైనా ఉన్నాయా? అన్నీ ఫోకస్ చేస్తూ త్వరలోనే సమగ్ర కులగణనను చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు తగు ప్రణాళికలు సైతం సిద్ధమయ్యాయి. అన్నీ అనుకూలిస్తే…. ఈ నెలాఖరు నుంచే ఈ కార్యక్రమం మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు అవసరమైన 3వేల సిబ్బందికి ఇప్పటికే తగు శిక్షణ కూడా పూర్తి చేసింది. కాగా ఈ గణన సందర్భంగా తర్ఫీదు పొందిన సిబ్బంది 15 రోజుల పాటు క్షేత్ర స్థాయిలోనే ఉండనున్నారు. ప్రజలకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించారు. ఇలా రాష్ట్రంలోని.10 కుటుంబాల నుంచి వివరాలు సేకరించబడ్డాయి. ఈ కులగణనలో మొత్తంగా 60 ప్రశ్నలు సంధించనున్నారు. ఇందులో సగం కుటుంబ నేపథ్యంపై ప్రశ్నలు ఉండగా.. మిగిలిన సగం వ్యక్తిగత వివరాలకు సంబంధించినవని. తినే తిండి నుంచి మొదలుకునిప్రభుత్వం అమలు చేస్తున్న ఏయే సంక్షేమ పథకాలు అందుతున్నాయి… ఇంటి యజమాని ఏంటి…. ఏడాదికి కుటుంబ ఆదాయం ఎంత ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రజలను అడగనున్నారు.
గత బీఆర్ ఎస్ సర్కారు 2014లో సమగ్ర సర్వే చేసి వివరాలు గోప్యంగా ఉంచడంపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కులగణనలో ఎలాంటి వివాదాలు, ఆరోపణలు రాకుండా పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ఈ అంశంలో సామాజికవేత్తలు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు, పీపుల్స్ కమిటీ ఆన్ క్యాస్ట్ సెన్సస్ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. వారి నుంచి తగు సూచనలు, సలహాలు కూడా స్వీకరించింది. అదే సమయంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా కులగణన సాఫీగా జరగడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నారు.
వారు ప్రధానంగా రాష్ట్ర బీసీ కులాల పేర్లను అందజేసే లెక్కల కొసమె రేవంత్ సర్కార్ ఈ సర్వే చేపడుతోందని.. వాళ్లతో పాటుగా రాష్ట్ర ప్రజల్లో ప్రతి ఒక్కరి కులం, ఉపకులం ఏంటి, స్థానికంగా కులాల పేర్లలో ఏమైనా మార్పులు జరిగినా ఇలాంటి వివరాలను కూడా సేకరిస్తారు. ఎవరిదైనా కులం పేరు తప్పుగా నమోదైతే భవిష్యత్తులో అనేక రకాలుగా నష్టం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. తప్పుడు వివరాలు నమోదు కాకుండా స్థానిక అధికారులు పటిష్టంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగానే భవిష్యత్తులో సంక్షేమ పథకాలతో పాటు అనేక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది. ప్రతీ ఒక్కరి ఆధార్ కార్డు, పాన్ కార్డ్, మొబైల్ నంబర్లతో వివిధ వివరాలను నమోదు చేస్తారు. విద్యార్హత, ఉద్యోగం, సొంత ఇల్లు, కారు , బైకు స్థిర ఉన్నాయా అని ఇలా పూర్తి స్థాయిలో సేకరించారు. జనాభా లెక్కలకన్నా ఎక్కువ ఈ సర్వే నుంచి ప్రభుత్వం ఫలితాలు సాధించింది.
రాష్ట్రంలో 3.80 కోట్లకు పైగా జనాబా
ప్రస్తుతం 3.80 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. మొత్తం కుటుంబాల సంఖ్య 1.10 కోట్లు దాటిందని అంచనా. తగ్గట్టుగానే సిబ్బంది నియామకానికి ప్రణాళికాశాఖ ప్రతిపాదనలు రూపొందించబడ్డాయి. అయితే ప్రతి 150 కుటుంబాలకు ఓ సర్వే గణకుడిని నియమిస్తారు. ఈ లెక్కన చూసుకుంటే మొత్తం 75 వేల మంది అవసరం ఉంటుంది. వీళ్లపై పర్యవేక్షకులుగా మరో 15 వేల మంది వరకు అవసరం అవుతుంది. వీళ్లందరినీ నియమించేందుకు అన్ని శాఖల సిబ్బంది వివరాలను సేకరిస్తున్నారు. అయితే ఉపాధ్యాయులను ఇలాంటి సర్వేలకు పంపించామని గతంలో కోర్టు తీర్పులున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖలోనే టీచర్లు కాకుండా 15 వేల మంది ఇతర ఉద్యోగులను ఈ సర్వే కోసం నియమించారు. ప్రతి ప్రభుత్వశాఖలో ఎంతమందిని తీసుకోవాలంటే జిల్లాలవారిగా వివరాలు పంపాలని కలెక్టర్లకు సూచనలు చేశారు. ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో చూసుకుంటే కోటికి పైగా జనాభా ఉన్నారు. దీంతో 30 వేల మందికి పైగా గణకులు అవసరమని అధికారులు ఇక్కడ ఉన్నారు.
60 రోజుల్లో పూర్తి చేయాలి
జిల్లాల్లో కుటుంబాల సంఖ్య ఆధారంగా కనీసం 2500 నుంచి 3 వేల మంది ఉద్యోగులను అన్ని శాఖల నుంచి ఈ సర్వే కోసం పంపిస్తారు. వీళ్లందరూ కూడా 15 రోజుల పాటు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారు. ఒకసారి సర్వే పూర్తయ్యాక వివరాలు పక్కాగా సేకరించారా లేదా అని కూడా ఆ తర్వాత తనిఖీ చేయడం కూడా అధికారులు యోచిస్తున్నారు. ఈ నెలలో సర్వే ప్రారంభించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం 60 రోజుల్లో సర్వే నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.