Home తెలంగాణ హై సెక్యూరిటీ ప్రాంతంలోనే అత్యాచారం… ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి -మాజీ మంత్రి హరీశ్ రావు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

హై సెక్యూరిటీ ప్రాంతంలోనే అత్యాచారం… ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి -మాజీ మంత్రి హరీశ్ రావు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
హై సెక్యూరిటీ ప్రాంతంలోనే అత్యాచారం... ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి -మాజీ మంత్రి హరీశ్ రావు - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర, తెలంగాణ బ్యూరో :-హై సెక్యూరిటీ ప్రాంతంగా చెప్పుకునే గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారం జరగడం ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి అని మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ పాలనలో అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం అయ్యాయి. నేరాల రేటు పెరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకి క్షీణిస్తున్నా…. ప్రభుత్వానికి కనీస పట్టింపు లేదని.. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఏనాడు సమీక్షించకపోవడం సిగ్గుచేటని గుర్తు చేశారు.

తెలంగాణలో ఇలాంటి ఘటనలు వరుసగా జరగటం ఆందోళనకరమన్నారు. అత్యాచార బాధితురాలికి భరోసా కల్పించాలని, నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా యుద్దప్రాతిపదికన తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మహిళా భద్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech