తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఘోర విషాదం. ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో మరణించిన ఘటన కలవరపెడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నివాసం ఉంటున్న రాజు- జమునకు ఐదేళ్ల వయసు ఉన్న కూతురు ( ఉక్కులు ) ఉంది. నిన్న ఉదయం వాళ్ళ కూతురు ఉక్కులు తనకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది.
దీంతో వెంటనే ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆ డాక్టర్ హన్మకొండకు రిఫర్ చేశారు. దీంతో ఆమె హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఉక్కులుకు వైద్యులు పరీక్షలు చేస్తుండగా ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమె పుట్టినప్పటి నుంచే గుండె సంబంధిత సమస్య ఉండొచ్చని, పేరెంట్స్ గుర్తించినట్లు గుర్తించారని వైద్యులు చెబుతున్నారు. కళ్ళ ముందే తమ పసికూన చనిపోవడాన్ని చూసి గుండెలు బాదుకుంటున్న తల్లిదండ్రుల బాధ స్థానికంగా కలచి వేసింది.