ముద్ర ప్రతినిధి, నిర్మల్: గతేళ్లుగా బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి విసిగా కొనసాగుతున్న వెంకట రమణను విధుల నుంచి తప్పించారు నూతన ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్ గా జె ఎన్ టి యు గోధన్ ను నియమిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో గత కొన్నేళ్లుగా విద్యార్థి సంఘాలు జరిపిన శాంతియుత పోరాటం ఎట్టకేలకు ఫలితాన్ని ఇచ్చింది. వీసీ వెంకటరమణను తొలగించాలని ట్రిపుల్ ఐటీ విద్యార్థి సంఘ నాయకులు మొదటి నుంచి శాంతియుత పోరాటాన్ని చేశారు. అయినా ప్రభుత్వ పెద్దలతో తనకున్న పరిచయాల వల్ల వీసీ ఇప్పటివరకు తన పదవిని కాపాడుకుంటూ వచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా పదిహేను రోజుల క్రితం ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వీసీ వెంకటరమణ పై ఉస్మానియా విద్యార్థి జేఏసీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. వీసీ వ్యవహార శైలిపై ఎమ్మెల్సీ కోదండరాం దృష్టికి తీసుకెళ్లారు.
డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ముధోల్ ఎంపిక చెందిన ఉస్మానియావిద్యార్థి జెఎసి నేత సర్దార్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల వినతి పత్రం. తక్షణం ఇన్చార్జి వీసీ వెంకటరమణ జోడు పదవులను తొలగించి, విజిలెన్స్ విచారణ చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. విద్యార్థి సంఘాల ఒత్తిడి మేరకు డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రత్యేక చొరవ తీసుకొన్నారు. ట్రిపుల్ ఐటీని గదిలో పెట్టాలన్న ఉద్దేశంతో వీసీ వెంకటరమణ తొలగించేందుకు సిఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లడంతో వీసీని తప్పించారని విద్యార్థి సంఘ నాయకులు చూస్తున్నారు. ఏది ఏమైనా విద్యార్థుల పోరాటం ఫలించడం పై సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.