- గరీబోళ్లకు అన్యాయం జరుగుతుందనే….
- మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టుకు కేసీఆర్ నో చెప్పారు
- అయినా రేవంత్ సర్కార్ మొండిగా ముందుకు పోతోంది
- హైడ్రా దూకుడును అడ్డుకుందాం….ప్రజలకు అండగా ఉందాం
- తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో
ముద్ర, తెలంగాణ బ్యూరో :-గరీబోళ్లకు అన్యాయం జరుగుతుందన్న కారణంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టును పక్కనపెట్టిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మానవీయ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం వల్లే….ఇలాంటి నిర్ణయాలు ఉంటాయి. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మానవత్వం లేదు….పేదలంటే జాలి సహాయం. అందుకే హైడ్రా పేరుతో ఇష్టానుసారంగా పేదల ఇళ్లను కూల్చడం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయాల కారణంగా పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఒక ప్రణాళిక, ఆలోచన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ప్రభుత్వమే 50 ఏళ్ల క్రితమే పర్మిషన్లు ఇచ్చి… ఇప్పుడు వాటిని కూలగొడతామని దుందుడుకుగా పోతామంటే కుదరదన్నారు. హైడ్రా, మూసీ ప్రాజెక్ట్ విషయంలో ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.
హైడ్రా హైడ్రాను పెద్ద, పెద్ద బిల్డర్లను బెదిరించేందుకే ఉపయోగిస్తున్నారని బీఆర్ఎస్ నమ్ముతోందని.తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ నగర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మూసీ ప్రాజెక్టులపై కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ ను ప్రజలలో ఎండగట్టాల్సిన వారితో ఆయన చర్చించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ,హైదరాబాద్‌లోని హైడ్రా, మూసీ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. నోట్ల రద్దు చేసినప్పుడు మోడీ ఎలాంటి కారణాలు చెప్పారో…. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్దతిలో ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఒక రోజు మూసీ సుందరీకరణ అంటారని… ఒక రోజు నల్గొండకు నీళ్లు అని, మరో రోజు రూ. లక్షా 50 కోట్లు ఎక్కడివి అని డీపీఆర్ లే లేదంటూ రోజుకో మాట మాట్లాడాడు.
మూసీపై రేవంత్ సర్కార్ చేస్తున్న లూటీనీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.మూసీకి సంబంధించి 100 శాతం మురుగు నీటి శుద్ది ప్లాంట్లను రూ. 4 వేల కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించింది. శుద్ధి చేసిన నీటినే నల్గొండ జిల్లాకు పంపించమన్నారు. దీని కోసం కొత్తగా ఖర్చు పెట్టాల్సిన పని. కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు నీళ్లు తెచ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం 11 వందల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. అలాంటప్పుడు మూసీ సుందరీ కరణం కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది.ఇవేమి పట్టించుకోకుండా నల్గొండకు నీళ్లు ఇచ్చేందుకు ఇష్టం లేదా అంటూ ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం సిగ్గు చేట.
గతంలోనే మూసీ సుందరీ కరణ చేపట్టాలని సుధీర్ రెడ్డి చైర్మన్‌గా ప్రయత్నం చేశామని గుర్తు చేశారు. అప్పుడే గరీబోళ్లకు అన్యాయం జరిగితే ఆ ప్రాజెక్ట్ వద్దని కేసీఆర్ చెప్పారని. ఇప్పుడు రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డుగా బీఆర్ఎస్ నాయకులు ఉంటారని చెప్పారు . తాము నిర్మించిన అన్ని ఎస్టీపీలను కూడా పర్యటిస్తామన్నారు. మా ఫామ్ హౌస్‌లు చట్టం విరుద్దంగా ఉంటే కూల్చేయాలి . వాటిని కూలగొడితే రేవంత్‌కు ఆనందం కలుగుతుందంటే ఆ పని చేయాలన్నారు. అంతే కానీ పేద ప్రజల జోలికి మాత్రం వెళ్లొద్దని హితవు పలికారు. రేవంత్ ప్రభుత్వం చట్టాన్ని గౌరవించకపోతే ….తాము న్యాయపరంగా కూడా పోరాటం చేస్తామన్నారు. దీని కోసం పార్టీ లీగల్ సెల్ ను మరింత బలపరిచినట్లు తెలిపారు. చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తూ…ప్రజలను కబ్జాదారులు అంటున్న ఎండ
గడతామన్నారు. దిక్కుమాలిన కాంగ్రెస్ పాలన కారణంగా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది.
ఏ ప్రభుత్వం ఉన్నా…బకాయిలను చెల్చాల్సిందే రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న కళాశాలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ 2 వేల కోట్లను చెల్లించామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం అనేది కంటిన్యూ ప్రాసెస్. గత ప్రభుత్వ బకాయిలను చెల్లించాలన్నారు. రూ. 650 కోట్లు ఇస్తే సరిపోతుందని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తే దాదాపు 12 లక్షల మందికి మేలు జరుగుతాయి. గత ప్రభుత్వాలు బకాయిలు పెడితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కట్టాల్సిందే అన్నారు. అది నెక్ట్స్ మేము అధికారంలోకి వచ్చినా తప్పదన్నారు.