Home సినిమా బాలయ్య, చరణ్ ని ఢీ కొడుతున్న సుమంత్! – Prajapalana News

బాలయ్య, చరణ్ ని ఢీ కొడుతున్న సుమంత్! – Prajapalana News

by Prajapalana
0 comments
బాలయ్య, చరణ్ ని ఢీ కొడుతున్న సుమంత్!


2025 సంక్రాంతికి 'NBK 109'తో నందమూరి బాలకృష్ణ, 'గేమ్ ఛేంజర్'తో రామ్ చరణ్ బరిలోకి దిగుతున్నారు. వెంకటేష్-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కూడా సంక్రాంతికే విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే సంక్రాంతి సమరానికి సై అంటూ సడెన్ గా సుమంత్ ఎంట్రీ ఇచ్చాడు.

సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మహేంద్రగిరి వారాహి'. రాజశ్యామల బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించారు. ఈ 2025 సంక్రాంతికి విడుదల చేయడానికి ఏర్పాట్లు చేయడానికి తాజాగా మేకర్స్ చెప్పారు. బరిలో స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి విడుదల ప్రకటించడం కంటెంట్ మీద నమ్మకమా? లేదా ప్రమోషనల్ స్టంట్ ఆ? అనేది తెలియాల్సి ఉంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech