ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణం రాయగిరిలోని యూనిటీ ఫార్మసీ కళాశాలలో బతుకమ్మ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మలతో కళాశాలకు చేరుకొని ఆటపాటలతో సందడి చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసుకుంటూ బతుకమ్మ పాటలతో హోరెత్తించారు.
విద్యార్థినిలు సంప్రదాయ దుస్తులు ధరించి రంగురంగుల బతుకమ్మలను కళాత్మకంగా పేర్చి విద్యార్థినులు మహిళా అధ్యాపకులు ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ ఏ ప్రభాకర్ రెడ్డి, డైరెక్టర్ పి గోవర్ధన్ రెడ్డి, ఫార్మసి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అంబటి శ్రీనివాస్, పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ఎస్ సరిత, ఏవో సునీత, ఏ ప్రియాంక, అనిత, పారిజాత, దివ్య, అమూల్య, ఉమ, శ్వేత, సాహితి రెడ్డి, నాగరాజు, అహ్మద్ విద్యార్థి విద్యార్థులు ఉన్నారు.