తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే గొప్ప అవకాశం నిరుద్యోగ యువతకు లభించింది. రెండు లక్షల వేతనంతో పలు ఉద్యోగ అవకాశాలను టీటీడీ కల్పిస్తోంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ను ఇప్పటికే టీటీడీ విడుదల చేసింది. ఆయా ఉద్యోగాలకు ఎంపిక అయ్యే అభ్యర్థులకు రెండు లక్షల వరకు వేతనాన్ని టీటీడీ చెల్లించనుంది. ఈ పోస్టులకు సంబంధించిన వివరాలను గుర్తించే.. తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండేళ్ల కాంట్రాక్టు ప్రాతిపదికన మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. టీటీడీ అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. తిరుపతిలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ సంస్థ ఈ ప్రకటనను విడుదల చేసింది. మిడిల్ లెవెల్ కన్సల్టెంట్ పోస్టులు మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంబీఏతోపాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఆఫీస్ మేనేజ్‌మెంట్‌లో 10 నుంచి 15 ఏళ్ల పనిచేసిన అనుభవం తప్పనిసరిగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉండాలి. ఐటి/అనలిటికల్/కమ్యూనికేషన్ వంటి వాటిలో నైపుణ్యం అవసరమని.
ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హిందూ మత అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రకటనలో సదర సంస్థ. అభ్యర్థులకు వయోపరిమితి 45 ఏళ్లు. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు సమర్పించేందుకు ఏడో తేదీ వరకు అందించారు. ఆశావహ అభ్యర్థులు తమ దరఖాస్తులను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్, పాత అలిపిరి గెస్ట్ హౌస్ తిరుపతి చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. recruitment.sismpc@gmail.com కి అవసరం ఉంటుంది. అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. తిరుపతిలో ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
కొండా సురేఖను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. సినీహీరో అక్కినేని అఖిల్ సంచలన కామెంట్స్
భూమ్మీద అత్యంత అనారోగ్యకర ఆహార పదార్థాలు ఇవే..