- దాతలకోసం ఎదురు చూపులు
ముద్ర/ వీపనగండ్ల :- చదువుల తల్లి కొలువై ఉన్న కల్వరాల గ్రామంలో ఒపేదింటి విద్యార్థి వైద్య రంగంలో రాణించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మక నీటి పరీక్షలో ఉన్నత ర్యాంకు సాధించి మెడికల్ కాలేజీలో సీట్ సాధించిన పేదరికంలో పుట్టిన అతనికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవ్వకుండా వైద్య విద్యను అభ్యసించేందుకు దాతల సహకారం కోసం ఎదురు చూస్తున్న కల్వరాల గ్రామానికి చెందిన బండారు దేవేందర్ అనే విద్యార్థి. మండల పరిధిలోని కల్వరాల గ్రామానికి చెందిన బండారు గోవింద్ కుమారుడు దేవేందర్ చిన్నతనం నుండి విద్యలో ఉంటూ చిట్యాల గురుకుల పాఠశాలలో చదువుతూ పదవ తరగతిలో 10 జిపి ఏ తో ఉత్తీర్ణత సాధించాడు. అనంతరం అదే గురుకుల కళాశాలలో బైపిసి విద్యను అభ్యసించి 95 శాతం ఉత్తీర్ణతతో తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి గౌలిదొడ్డి కళాశాలలో వైద్య విద్య కోసం నిర్వహించిన నీటి పరీక్షకు ఇటీవల విడుదలైన నీట్ పరీక్ష ఫలితాల్లో 464 మార్కులు సాధించి హైదరాబాద్ సమీపంలోని భాస్కర్ మెడికల్ కాలేజీలో సీట్ సాధించారు.
దేవేందర్ తల్లిదండ్రులు ఇద్దరు కూలి పనులు చేస్తూ కొడుకును చదివించారు. వైద్య విద్యను చదవాలంటే డబ్బుతో కూడుకున్న పని కావడంతో కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల తమ కొడుకు చదువుకు దూరం అవుతాడని బెంగ పెట్టుకున్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజీలో తల్లిదండ్రులు అప్పులు చేసి నెంబరు సంపాదించడానికి ఇంకా ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో కొడుకు విద్య ఏ విధంగా ఉంటుందో, దాతలు ఎవరైనా ఉంటే ఆర్థిక సహకారం అందించి తమ కొడుకు వైద్య విద్య ఆగిపోకుండా ఆర్థిక సహకారాన్ని అందించాలని దేవేందర్ వేడుకుంటున్నారు.ఆర్థిక సహకార ఆర్థిక దాతలు ఫోన్‌లకు 9502838026, 9704862230 ద్వారా ఫోన్ చేయండి సాయం అందించి వైద్య విద్యకు సహకరించాలని వేడుకుంటున్నారు.. వైద్య రంగంలో రాణించి పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు.