1990వ దశకంలో విలన్ అంటే ప్రతి డైరెక్టర్‌కి, ప్రొడ్యూసర్‌కీ కనిపించేది ఒక్కరే. అతనే మోహన్‌రాజ్. దాదాపు 15 సంవత్సరాలపాటు తెలుగులో తిరుగులేని విలన్‌గా పేరు తెచ్చుకున్న మోహన్‌రాజ్ ఇకలేరు. గత నాలుగురోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌రాజ్‌కు గురువారం గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించిందని, ఇంటికి తీసుకెళ్లిపోవాల్సి ఉందని వైద్యులు తెలిపారు. అప్పుడాయన్ను తిరువనంతపురం దగ్గరలోని కంజిరంకులం ప్రదర్శించారు. అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మోహననరాజన మృగతి పట్ల సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
1988లో సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించారు మోహననరాజన. అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. మలయాళంలో కిరీదమ్ అనే చిత్రంలో ఒక భయంకరమైన విలన్ కోసం కనిపించే సమయంలో ఆ అవకాశం మోహన్‌రాజ్‌కు లభించింది. ఆరడుగులకు పైగా ఎత్తుతో భారీ విగ్రహంతో కనిపించే మోహన్‌రాజ్ ఆ సినిమాలో కిరిక్కాడాన్ జోస్ పాత్ర పోషించారు. అప్పటి నుంచి మలయాళంలో అదే పేరుతో ప్రసిద్ధికెక్కారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో కొన్ని వందల సినిమాల్లో నటించారు మోహన్‌రాజ్. తెలుగులో ఆయనకి పేరు తెచ్చిన సినిమాలు లారీ డ్రైవర్, నిప్పురవ్వ, చినరాయుడు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, అసెంబ్లీ రౌడీ వంటి అనేక చిత్రాలలో హీరోతో ఢీ అంటే ఢీ అనే క్యారెక్టర్లు చేసి ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. మోహన్‌రాజ్ నటించిన చివరి సినిమా శివశంకర్.