- వరిచేలు చేతికొచ్చే ముందు నేలకొరకడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతాంగం
తుంగతుర్తి ముద్ర:- ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ రైతులను అతలాకుతలం చేస్తోంది. వరి నాట్లకు ముందు తీవ్ర వర్షాభావ పరిస్థితులు కాలేశ్వరం జలాలు రాక అరకురా నాట్లు వేసిన రైతాంగానికి అనంతరం భారీ వర్షాలతో ఊరట లభించింది. వరి నాట్లు వెనుకకు వేసిన చెరువులు నిండడంతో ఆయకట్టు సాగులోకి వచ్చింది .నాటి నుంచి అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి .ఒకపక్క మండే ఎండలు మరోపక్క భారీ వర్షాలతో వ్యవసాయం సాగుతుంది .తీర వరిచేలు పొట్ట దశలో కొన్ని, కంకి దశలో కొన్ని, కోత దశలో, ఉన్న తరుణంలో బుధవారం నాడు కురిసిన భారీ వర్షం రైతాంగాన్ని అతలాకుతలం చేసింది. .ఈ వర్షంతో వరి పంటకు తీవ్ర నష్టం కలిగింది. ఈదురుగాలితో కూడిన వర్షం వల్ల కొన్ని వరి చేలు పూర్తిగా అడ్డం పడిపోయి రైతాంగానికి నష్టం కలిగించింది.
వరి చేల కంకులుపాలు పోసుకునే దశలో అడ్డం పడిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .ఇంకా నెల రోజులుగా వరిచేలు ఉండాల్సి ఉండగా అకాల వర్షానికి అడ్డం పడిపోవడం రైతాంగానికి తీవ్ర ఆవేదన కలిగించింది. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .ఇంక ముందు వర్షాల పరిస్థితి ఇలాగే కొనసాగితే వరి పంట మార్కెట్ కు చేరడం కష్టమేనని రైతులు అంటున్నారు .ఏది ఏమైనా ఈ ఏడాది వర్షాకాలం వరి పంట, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పవచ్చు.