ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన డెమొక్రాటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక మాజీ అధ్యక్షుడు గౌరవనీయులైన శ్రీ. మైత్రిపాల సిరిసేన డాక్టర్ కలశ నాయుడిని ఆసియా ఐకాన్ 2024లో సత్కరించారు.
– చిన్నారి లక్ష్యానికి ఐక్యరాజ్యసమితి ఫిదా
– గౌరవ డాక్టరేట్‌తో సన్మానం
– ఆసియా ఐకాన్ 2024 అవార్డు విన్నర్
పెద్ద’య్యాక ఏమ’వుతావురా అని పదేళ్ల పిల్లల్ని అడిగామ’నుకోండి. టీ అవుతాచర్, డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్, సిన్మా యాక్టర్, క్రికెటర్, అంటూ రకరకాల ప్రొఫెషన్ల పేర్లు తప్ప సోషల్ వర్కర్‌నని మాత్రం అనరు. ఎందు
కంటే వాళ్లకు అసలు ఆ పేరు, ఆ ప్రొఫెషన్ గురించి తెలియనే తెలియదు. కానీ, కలశనాయుడు మాత్రం తన ఈడు పిల్లలకు హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్. పదేళ్లు నిండకుండానే స్వచ్ఛంద సమాజ సేవలకు గాను ఐక్యరాజ్యసమితి నుండి గౌరవ డాక్టరేట్, గ్లోబెల్ యంగెస్ట్ సోషల్ వర్కర్ బిరుదునూ అందుకుంది.
గ్లోబల్ సోషల్ సర్వీస్ కేటగిరిలో ఆసియా ఖండంలోనే అత్యంత ప్రిస్టేజియస్ అవార్డు ఆసియా ఐకాన్ 2024ను దక్కించుకుంది. అవార్డు తీసుకున్న సమయంలో కలిశ మాట్లాడుతూ భవిష్యత్‌లో కూడా సోషల్ సర్వీస్ కొనసాగిస్తానని, కలశ ఫౌండేషన్ ద్వారా 2015లో ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసిన గ్లోబల్ మిలీనియం గోల్స్ 2030 ఎజెండా సాధన ప్రధానంగా.
పట్టుమని పదేళ్లు కూడా నిండని ఆ చిన్నది పెద్దోళ్లకు సైతం నోరు తిరగని పేర్లు, లక్ష్యాలు చెబుతుంటే ఆ చిన్నారి గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదూ!.
డా. కలశనాయుడు మేడపురెడ్డి. 11 సంవత్సరాల ఈ చిన్నారి పేరు మనకు పెద్దగా తెలియక పోవచ్చు. కానీ, ఇంటర్నేషన్ల్ సోషల్ సర్వీస్ సొసైటీలో మాత్రం టాప్ సెలబ్రెటీ. 11 ఏళ్ల వయసులో ఐక్యరాజ్యసమితి నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్న తొలి వ్యక్తిగా, గ్లోబెల్ యంగెస్ట్ సోషల్ వర్కర్‌గా చిరపరిచితం. తన పేరుతో ఏర్పటైన కలశ ఫౌండేషన్ ద్వారా ఇండియాతో పాటు పలు దేశాల్లో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల కలశమ్మగా సుపరిచితురాలు.
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సంఘ సేవకులు, స్వచ్ఛంద సంస్థలున్నాయి. పేదరికం, విద్య, వైద్యంతో పాటు పలు సామాజిక రుగ్మతలపై వారు సేవ లందిస్తున్నారు. తమ వంతు సాయం చేస్తున్నారు. అయితే, ఆయా వ్యక్తులకు గానీ, సంస్థలకు గానీ ఐక్యరాజ్య సమితి గ్లోబల్ పీస్ కౌన్సిల్ నుండి దక్కని గౌరవం, ప్రశంసలు, అరుదైన గౌరవ డాక్టరేట్ పురస్కారం పదకొండేళ్ల కలశనాయుడుకు లభించడానికి కారణం కారణం గ్లోబల్ మిలల్ ఫలి గ్లోబల్ మిలి
కలశ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ 2013, ఆగస్ట్ 30న ప్రారంభమైంది. కలశనాయుడు పుట్టిన క్షణంలోనే నిరుపేదలను, అన్నార్తులను, బాధితులను ఆదుకోవడానికి, సాయం అందించడానికి, సేవ చేయడానికి, పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను సత్కరించడానికి ఈ కలశ ఫౌండేషన్ ఆవిర్భవించింది. కలశతో పాటే పుట్టిన ఆ ఫౌండేషన్ ఆ చిన్నారితో పాటు దినదినప్రవర్థమానమవుతూ, శాఖోపశాఖలుగా సేవా కార్యక్రమాలను జిల్లా స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది.
పసి మొగ్గగా ఉన్నప్పుడే సమాజ సేవలో భాగమైన కలశనాయుడు ఫౌండేషన్ ద్వారా గ్లోబల్ గోల్స్ అజెండాపై సేవలందిస్తున్నారు. యుఎన్ఓ 2030 అజెండా పేదరిక నిర్మూల’, ఆక’లి చావులు నిర్మూలించడం, వైద్యం, ఆరోగ్యం, విద్య, లింగ వివక్ష లేని స’మానత్వం, పరిశుభ్రమైన తాగు మరియుశుద్ధ్యం, క్లీన్ ఎన’ర్జీ, ఉద్యోగావకాశాలు’ కల్పించి ఆర్థికాభివృద్ధికి తోడ్పడింది ల్పించడం, అసమానతల నిర్మూలన, వికసిత నగరాలు, ..సంఘాలు , ఉత్పత్తి , వినియోగం, వాతావరమార్పులపై కార్యచరణ తో పాటు సుస్థిరమైన శాంతి, బలమైన న్యాయవ్యవస్థ కోసం డా. కలశనాయుడు ఫౌండేషన్ పని చేస్తోంది.ఆ కారణంగానే అంతర్జాతీయ అవార్డులు కలశను వరిస్తున్నాయి.