ముద్ర.వీపనగండ్ల :- అడవి పందుల నుంచి పంటను రక్షించేందుకు ఏర్పాటుచేసిన విద్యుత్ తీగలకు తగిలి వ్యక్తి మృతి చెందిన వీపనగండ్ల సంఘటన సంగినేనిపల్లి గ్రామ శివారులో ప్రమాదం జరిగింది. స్థానిక ఎస్సై రాణి కథన మండల పరిధిలోని సంగినేనిపల్లి గ్రామానికి చెందిన గొల్ల పరమేష్ అనే రైతు మొక్కజొన్న పంటను అడవి పందుల బారి నుండి కాపాడుకోవడానికి అక్రమంగా పొలం చుట్టూ ఇనుప తీగను ఏర్పాటు చేసి వాటికి తీగతో షార్ట్ విద్యుత్ వచ్చేటట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వల్లభాపురం తండా కు చెందిన కాట్రావత్ నారాయణ(58) తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో సొంత పని నిమిత్తం పొలాల వెంట నడుచుకుంటూ సంగినేనిపల్లి గ్రామం వస్తుండగా గొల్ల పరమేష్ మొక్కజొన్న పంట రక్షణ కోసం విద్యుత్ కంచెకు తగిలి షార్ట్ యాజమాన్యంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. సంఘటన వనపర్తి సీఐ నాగభూషణం పరిశీలించారు. పంట పొలానికి అక్రమంగా విద్యుత్తు తీగల ఏర్పాటు చేసి కాట్రావత్ నారాయణ మృతికి కారకుడైన గొల్ల పరమేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కే రాణి తెలిపారు. మృతునికి భార్య మంగ్లీ, ఇద్దరు కుమారులు కూతురు ఉన్నారు.
పంట పొలాలకు రక్షణగా విద్యుత్తుగా ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు
రైతులు అడవి జంతువుల నుంచి పంటలను రక్షించుకోవడానికి ఇనుప తీగల ఏర్పాటు చేసి విద్యుత్ షాక్ తగిలేలా చేస్తే చర్యలు తప్పవని వనపర్తి సీఐ నాగభూషణం హెచ్చరిక. షార్ట్‌తో రక్షణగా తీగలు ఏర్పాటు చేయడం వల్ల వ్యక్తులు చనిపోయే ప్రమాదం ఉందని, మరో అడవి జంతువులను కూడా చంపటం నేరమని అన్నారు.