- హైదరాబాద్ శివారు నుంచి బస్సులు
- ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగుళూరుకు సర్వీసులు
- కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు
- టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
ముద్ర, తెలంగాణ బ్యూరో : దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపనున్న టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాలను కల్పించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. గత దసరాతో పోల్చితే ఈసారి మహాలక్ష్మి పథకం అమలుతో పాటు అక్టోబర్ నెలలో11 శుభముహుర్తాలు ఉన్నాయి. ఆ రద్దీకి తగ్గట్టుగా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికను రూపొందించింది. రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల సమయాభావం తగ్గించేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి దసరాకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ, తదిత ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులను అందుబాటులో ఉంచారు.
ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయ’వాడ, బెంగళూరు, తదిత’ర ప్రాంతాలకు బస్సులను నడిపేలా రూపొందించారు. ఈ మేరకు సోమవారం దసరా పండుగకు ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాలు ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై తమ క్షేత్ర స్థాయి అధికారులతో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వర్చ్‌వల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. గత దసరాతో పోల్చితే ఈ సారి మహాలక్ష్మి పథకం అమలు వలన రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని, గతంలో ఇదే ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని. రద్దీని బట్టి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలి. అక్టోబర్ 12న దసరా పండుగ ఉన్నందున 9,10,11 తేదిల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఆయా రోజుల్లో అవసరాలకు అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులను నడపాలన్నారు. రద్దీ రోజుల్లో ఎన్హెచ్ఏఐ అధికారులతో మాట్లాడి ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక లెన్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, సంతోష్ నగర్, తదిత ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, తాగునీరు, ఇతర సంస్థలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ దసరాకు కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో కాలుష్యరహిత కొత్త ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను వినియోగించుకోవాలన్నారు. పోలీస్, రవాణా, మున్సిపల్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ టీజీఎస్ఆర్టీసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను సంస్థ అధికారిక వెబ్సైట్ tgsrtbus.inలో చేసుకోవాలని సూచించింది. దసరా స్పెషల్ సర్వీస్‌లకు సంబంధించి పూర్తి సమాచారం కోసం త’మ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలి.