తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెక్రటేరియట్లో రిజల్ట్స్‌ను విడుదల చేశారు.కేవలం మార్కులు, ర్యాంక్ మాత్రమే ఉంటాయి.. జిల్లాల వారీగా.. తరువాత మెరిట్ రోస్టర్ ప్రకారం సెలెక్టెడ్ లిస్టును జిల్లాల వారిగా జిల్లా విద్యా అధికారులకు ఇస్తారని అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం.. సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం 1:1 నిష్పత్తిలో జిల్లాల వారిగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం అధికారిక వెబ్సైట్ https://tgdsc.aptonline.in/tgdsc/ లో చెక్ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి ఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈ సారి డీఎస్సీ పరీక్షలు రాశారు.