తెలంగాణ కాంగ్రెస్ కోసం మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈరోజు ఈడీ తనిఖీలు చేపట్టారు. ఢిల్లి నుంచి వచ్చిన ఈ ప్రత్యేక బృందం ఏకకాలంలో 16 చోట్ల విస్తృత తనిఖీలు చేపట్టింది. భారీ భద్రత హైదరాబాద్‌లోని మంత్రి ఇంట్లో ఈడీ అధికారులు ఈ సోదాలు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో కూడా ఇలా ఈడీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే.
పొంగులేటి ఇంటితో పాటు ఆయనకి చెందిన ఫార్మా రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు ఇక ఖమ్మంలోని ఆయన నివాసంలో కూడా రైడ్స్ జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న పొంగిలేటికి హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో రాఘవ కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రాఫీస్లో ఉన్నాయి. శుక్రవారం నాడు ఈడీ అధికారులు సీఆర్పీఎఫ్ పోలీసుల భద్రత ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.