Home తెలంగాణ కాళేశ్వరాన్ని ఉదాహరణగా తీసుకొండి … యువ ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచన – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

కాళేశ్వరాన్ని ఉదాహరణగా తీసుకొండి … యువ ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచన – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
కాళేశ్వరాన్ని ఉదాహరణగా తీసుకొండి ... యువ ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచన - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • ఎలాంటి తప్పు చేయకూడదో నేర్చుకోండి
  • కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకుంటే ఆ శాఖే ఉండదు
  • నాయకులు తీసుకునే నిర్ణయాలు అమలు చేయవలసింది కాదు
  • ఉద్యోగం కాదు బావోద్వేగంగా భావించండి
  • నాణ్యత,నిబద్ధత విషయంలో రాజీపడొద్దు
  • రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు కీలకమని గుర్తించండి
  • ఇంజనీర్లు ఇకపై క్షేత్రస్ధాయిలో ఉండాల్సిందే
  • ఏఈలకు నియామక పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉద్యోగంలో చేరాక ఎలాంటి తప్పులు చేయాలో తెలుసుకోవాలంటే గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఉదాహరణగా సీఎం రేవంత్ రెడ్డి యువ ఇంజనీర్లకు సూచించారు. అవినీతి,ధనదాహంతో రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఆ ప్రాజెక్టు కట్టడం కూలడం రెండూ జరిగిపోయాయి. దీనికి అధికారులను బాద్యుల్ని చేయాలా..? లేక రాజకీయ నాయకులనా? ఎవరిని బాధ్యులను చేయాలో చెప్పాలని ఇంజనీర్లను అడిగారు. రాష్ట్ర నీటి పారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 700 మంది అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లకు గురువారం హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో ఉన్న జలసౌధలో సీఎం చేతుల మీదుగా నియామకం ఎంపిక. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ…కాళం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే అసలు ఆ శాఖే ఉండదన్నారు. చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఈ చెప్పారని ఒకరు, ఎస్ఈ చెప్పారని ఇంకొకరు..ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కావని అబిప్రాయపడ్డారు. ఫలితంగా రూ. లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయాయి. అసలు నిర్మాణం కంప్లీట్ కాకముందే కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును అధ్యయనం చేయాలన్నారు. గత పాలకులు ఈ ప్రాజెక్టును ప్రపంచ అద్భుతంగా వర్ణించారన్న ఆయన కుప్పకూలిన కాళేశ్వరానికి ఎవరిని బాధ్యులుగా చేయాలో సమాధానం చెప్పాలన్నారు. ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో సమర్థంగా పని చేసి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు. నిర్మాణ సామగ్రి క్వాలిటీగా లేదని వెనక్కి పంపి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అన్నారు.ఒక గొప్పతనాన్ని చెప్పే దేశం ఆ దేశంలోని నిర్మాణాలు, కట్టడలేనని సీఎం రేవంత్ పేర్కొన్నారు. నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడతారు.

చివరకు నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు ఇన్నేళ్లు ఉండేవి కావన్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులు లక్షల ఎకరాలకు నీళ్లు, విద్యుత్‌ ఇస్తున్నాయన్న ఆయనఐదేళ్ల క్రితం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అప్పుడే కూలిపోయిందని ఆక్షేపించారు. పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటో గమనించాలన్నారు. రూ. 2లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కా. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కావొద్దనే సంకల్పంతో తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. రాష్ట్ర పునర్నిర్మాణంలో అత్యంత కీలకమన్న ఆయన ప్రాజెక్టుల పూర్తికి క్షేత్ర స్థాయిలో పనులు చేయాల్సిన యువ ఇంజనీర్లకు నీళ్లు ఇవ్వాలని సూచించారు. తెలంగాణ సంస్కృతిలో నీళ్ల భాగస్వామ్యం ఉందన్న సీఎం అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమైనందుకు గర్వంగా భావించాలన్నారు. పైరవీలతో వచ్చే వారికి సుదూర ప్రాంతాలకు పోస్టింగ్ ఇచ్చి శిక్షించాలన్నారు. ఉద్యోగంలో చేరాక పని మీద శ్రద్ధ పెట్టాలే తప్పా పోస్టింగ్ లపై కాదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తరువాత నియామక ప్రక్రియ వేగంగా జరుగుతుంది.

తాము పొందిన ఉద్యోగాన్ని భావోద్వేగంగా భావించాలని నియామక పత్రాలు అందుకున్న ఇంజనీర్లకు సూచించారు. రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందన్న సీఎం వారి భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో ఉన్నవాళ్లే రాణిస్త అనుభవం. గతంలో ఇంజనీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారనీ ఫీల్డ్ విజిట్ చేసాకే రిపోర్టులు రాసేవారు. కానీ ఈ మధ్య క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులోకి వచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉన్నారు.

30 రోజుల్లో డిజిటల్ హెల్త్ కార్డులు..!

మరో 30 రోజుల్లో ప్రజలకు డిజిటల్‌ హెల్త్‌కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి. గురువారం హైదరాబాద్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ రెనోవా క్యాన్సర్‌ ఆసుపత్రిని ప్రారంభించిన తర్వాత మాట్లాడిన సీఎం.. విద్య, ఆరోగ్యానికి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోంది.

ఈ నెల రోజులలోపు 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్‌ డిజిటలైజ్‌ చేస్తామన్నారు. హెల్త్‌కార్డుల్లో గత చికిత్స వివరాలు పొందుతామని చెప్పారు. క్యాన్సర్ చికిత్స కోసం స్వచ్ఛంద సంస్థలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని మంత్రి దామోదర రాజనర్సింహకు మంత్రి సూచించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech