- రాష్ట్రవ్యాప్తంగా 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
- సన్నాలకు,దొడ్డు వడ్లకు వేరు వేరుగా కొనుగోలు కేంద్రాలు
- 146. 28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనా
- 91.28లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అంచనా వేసింది
- తొలిసారిగా 40మె.టల ధాన్యం నిల్వకు గోడౌన్ ల ఏర్పాటు
- డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వం
- సరిహద్దు రాష్ట్రాలనుండి వచ్చే ధాన్యంపై గట్టి నిఘా
- ఖరీఫ్ పంట కొనుగోళ్ల సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఈ ఖరీఫ్ నుండే సన్నాలు క్వింటా ఒక్కింటికి రూ.500 బోనస్ అందజేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఆశించిన లక్షల మేరకు 36.80 ఎకరాల్లో సన్నాలు సాగు చేస్తున్నారు.రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,139 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంగాల ద్వారా 4,496,ఐ.కె.పి కేంద్రాల ద్వారా 2102,ఇతరుల 541 కొనుగోలు కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసినట్లు వివరించారు. మంగళవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో 2023-24లో ఖరీఫ్ పంట కొనుగోలుపై జాయింట్ కలెక్టర్ లు,జిల్లా పౌర సరఫరాల అధికారులు, జిల్లా స్థాయి పౌర సరఫరాల శాఖ మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో 60.39లక్షల ఎకరాల్లో సాగు జరిగింది.
ప్రభుత్వ అంచనా ప్రకారం 91 లక్షల 38 వేల మెట్రిక్ టన్నుల లక్షల దిగుబడి వస్తుంది. అందులో 36.08లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేస్తే 88.09లక్షల వరకు సన్నాల దిగుబడి ఉంటుందన్నారు. 23.58లక్షల మెట్రిక్ టన్నుల ఎకరాల్లో దొడ్డు వడ్లు సాగు చేస్తే 58.18లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అక్టోబరు మొదటి వారంలో మొదలయ్యే కొనుగోళ్లు జనవరి మాసంలో కొనసాగుతాయన్న మంత్రి.. అందుకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటన. ఇందులో మొదటివారంలో నల్లగొండ, మెదక్, రెండవ వారంలో నిజామాబాద్,కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి,మహబూబ్ నగర్,నగర్ కర్నూల్,నారాయణపేటలో కొనుగోళ్లు జరుగుతాయి.మూడవ వారంలో కరీంనగర్, జగిత్యాల,వరంగల్ జనగామ,సూర్యాపేట,మేడ్చల్,భూపాలపల్లి,ములుగు,ఖమ్మంలు ఉన్నాయి.
నాల్గవ వారంలో మంచిర్యాల, సంగారెడ్డి, పెద్దపల్లి ,హన్మకొండ,మహబూబాబాద్,వికారబాద్,ఆదిలాబాద్ లు ఉండగా నవంబర్ మొదటి వారంలో నిర్మల్ ,సిద్దిపేట, రంగారెడ్డి,రెండో వారంలో కొనరం భీం ఆసీఫాబాద్,భద్రాద్రి కొత్తగూడెం,గద్వాల,వనపర్తి లు ఉన్నాయి. మొదటి సారిగా ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ ఉంచేందుకు వీలుగా గోడౌన్లను సిద్ధం చేసిందని ఆయన తెలిపారు.ఖరీఫ్‌లో రాష్ట్ర సన్నాహాలను జనవరి నెల నుండి అన్ని చౌక ధరల కార్యక్రమాలలో సన్న బియ్యం పంపిణీ చేశారు. ధాన్యం కొనుగోలులో అధికారుల పాత్ర కీలకంగా ఉంటుంది.
దీంతో సుమారు మూడు కోట్ల మందికి లబ్ది చేకూర్చినట్లు తెలిపిన మంత్రి ఉత్తమ్ మనిషి ఒక్కింటికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. గతంలో అవకతవకలకు ఇచ్చిన మిల్లర్లకు ధాన్యం ఇవ్వడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో ప్రజల సొమ్ముతో అప్పు చేసి కొనుగోలు చేస్తున్న ధాన్యం అంశంలో అవకతవకలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. సరిహద్దు రాష్ట్రాల నుండి ధాన్యం దిగుమతి జరగకుండా దిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమీక్షలో పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డి.యస్.చవాన్, జైంట్ సెక్రటరీ ప్రియాంక అలా,స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ యం.డి.లక్ష్మి, మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ ఉన్నారు.