Home తెలంగాణ రాజీనామా కాదు.. రాజకీయ సన్యాసం చేస్తా – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

రాజీనామా కాదు.. రాజకీయ సన్యాసం చేస్తా – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
రాజీనామా కాదు.. రాజకీయ సన్యాసం చేస్తా - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • అమృత లో తాను చెప్పింది తప్పని తేలితే దేనికైనా సిద్ధం
  • పొంగులేటి రాజీనామా అవసరం లేదు
  • సీఎం రేవంత్ రాజీనామా చేయాల్సి వస్తుంది
  • మంత్రులకు చట్టాలే కాదు.. చుట్టరికాలు కూడా తెలిసినట్లు లేవు
  • ఒక్క రూపాయి అవినీతి జరిగినా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చట్టం కిందకే వస్తుంది
  • పొంగులేటికి చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సీజే దగ్గరకు వెళ్దాం
  • లేదంటే కేంద్రాన్ని సెంట్రల్ విజిలెన్స్ దగ్గరకు వెళ్దాం
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమృత పథకంలో తాను ఆరోపించిన విధంగా అవినీతి జరగలేదని తేలితే ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేయడం కాదు….రాజకీయ సన్యాసం తీసుకున్నానని కేటీఆర్ సవాల్ విసిరారు. తనపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఘాటైనా కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ను పొంగులేటి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం కనిపిస్తోందని. ఈ విషయంలో ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదు.. ముఖ్యమంత్రి రేవంత్ నే రాజీనామా చేయాల్సి వస్తుందని కేటీఆర్ జోస్యం చెప్పారు.

దగుల్బాజీలు…

రాజీనామా చేయాల్సిన దగుల్బాజీలు ఈ ముఖ్యమంత్రి ఆయన మంత్రులే అని కేటీఆర్ ఉన్నారు. కాంగ్రెస్ మంత్రులకు చట్టాలు మాత్రమే కాదు….. చుట్టరీకాలు కూడా తెలిసినట్టు లేవని ఎద్దేవా చేశారు.భార్య తమ్ముడు బావమరిది కాకుండా ఇంకేమి అవుతాడో పొంగులేటి చెప్పాలన్నారు.ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్‌తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను కూడా నేను ప్రస్తావించిన నేపథ్యంలో పొంగులేటి ఆగమేఘాల మీద ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని అన్నారు. రూ. 1137 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, ఒక్క రూపాయి అవినీతి జరిగిన ఈ చట్టం వర్తిస్తుందనే విషయం ఆయన తెలుసుకోవాలని అన్నారు. పొంగులేటికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళుతున్నామన్నారు.లేదంటే రైల్వేని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ లేదా మరి ఏదైనా ఏజెన్సీ దగ్గరకైనా వెళదాం అని అన్నారు. గతంలో ఉన్న ఫైల్స్‌తో పాటు ఇప్పుడు జరిగిన టెండర్ల వ్యవహారంపై వివరాలు వారి ముందు ఉంచుదామన్నారు.ఆయన న్యాయంగా తీర్పు చెప్పిన తర్వాత నేను చెప్పింది అబద్ధమంటే రాజీనామా కాదు రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ చేశారు.

ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ టెండర్ల వ్యవహారంలో అవినీతి జరిగింది ముఖ్యమంత్రికి, మంత్రి పొంగులేటికి తెలుసు అని అన్నారు. ముఖ్యమంత్రి ఆశ్రిత పక్షపాతం లేకుండా బంధువులకు అక్రమంగా లాభం చేకూరుతుందని ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ అవినీతికి పాల్పడ్డాడని తెలిపారు. కేవలం రెండు కోట్ల ఉన్న బావమరిది కంపెనీకి రూ. 1000 కోట్ల కాంట్రాక్టు ఇచ్చి అవినీతి జరగడం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? అని నిలదీశారు.

ఈ మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించిన అంశంలో కేంద్ర మంత్రులుకిషన్ రెడ్డి, బండి సంజయ్ నుంచి మొదలుకొని బీజేపీకి చెందిన ఒక్క ఎంపీ మాట్లాడటం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధుల్లో అవినీతి జరుగుతున్నా వారు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుతున్నానని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అవినీతిపై మా దగ్గర సమాచారం. ఈ అవినీతిని వరుసగా బయటపెడతామని కేటీఆర్ తెలుసు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech