గ్రేటర్ హైదరాబాద్ మొత్తం చెరువుల, కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా నగరంలో మళ్లీ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. చెరువుల, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు కబ్జా చేసి నిర్మించి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. గతకొన్ని రోజుల నుంచి కూల్చివేతలను ఆపేసిన హైడ్రా తాజాగా కూల్చివేతలు ప్రారంభించింది. కూకట్‌పల్లి నల్లచెరువులోని ఆక్రమణలను తెల్లవారుజాము నుంచే కూల్చేస్తోంది.
నల్లచెరువు మెుత్తం విస్తీర్ణంలో 27 ఎకరాలు కాగా 14 ఎకరాల కబ్జాకు గురైనట్లు గుర్తించారు.తెల్లవారుజాము నుంచే అధికారులు అక్కడికి వెళ్లిన హైడ్రామా అధికారులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు చేపట్టారు. నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లును, నేలమట్టం చేస్తున్నారు. కొందరు అక్రమంగా షెడ్యూల్ నిర్మించినవారు ఉల్చివేతలకు అధికారులు వస్తున్నారని తెలిసి రేకులను సామాగ్రిని వారే తొలగించుకున్నారు.