Home తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు సీఐడీ నోటీసులు… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు సీఐడీ నోటీసులు… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు సీఐడీ నోటీసులు... - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • మరో ముగ్గురు కమర్షియల్ టాక్స్ అధికారులకూ
  • వాణిజ్య పన్నుల శాఖ స్కాంలో కదులుతోన్న డొంక
  • త్వరలోనే వీరిని ప్రశ్నించిన సీఐడీ

ముద్ర, తెలంగాణ బ్యూరో : వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన రూ. 1400 కోట్ల కుంభకోణంలో దర్యాప్తును సీఐడీ ముమ్మరం చేసింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు అధికారులకు సీఐడీ అధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు.

ఈకేసులో వాణ్యిజ్య పన్నుల అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావును ఏ1గా, ఉప కమిషనర్ శివరామ్ ప్రసాద్ ను ఏ2గా, హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబును ఏ3గా, ప్లియంటో టెక్నాలజీస్ ను ఏ4గా చేర్చారు. వాణిజ్య పన్నుల శాఖలో వస్తువులు సరఫరా చేయక పోయినట్లు తెలుస్తోంది, బోగస్ ఇన్వాయిస్ లు సృష్టించారంటూ ఆ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్..మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ సహా ఆ శాఖ అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంది. గతంలో హైదరాబాద్ క్రైమ్ సెంట్రల్ స్టేషన్ (సిఎస్‌ఎస్) వాణిజ్య పన్నుల (జిఎస్‌టి) మోసానికి సంబంధించి రూ. 1,400 కోట్ల అవినీతికి సంబంధించి కేసులు నమోదు చేసింది. ఆ తర్వాత కేసును సీఐడీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech