Home తెలంగాణ తుంగతుర్తి ప్రాంతంలో భారీ వర్షాలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

తుంగతుర్తి ప్రాంతంలో భారీ వర్షాలు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
తుంగతుర్తి ప్రాంతంలో భారీ వర్షాలు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • పొంగిపొర్లుతున్న వాగులు వంకలు
  • భారీగా అలుగులు పోస్తున్న చెరువులు కుంటలు
  • నీట మునిగిన పంట పొలాలు ఆందోళన చెందుతున్న రైతులు
  • శనివారం రాత్రి నుండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం
  • తుంగతుర్తి పట్టణ సమీపంలోని రోడ్లపై ప్రవహిస్తున్న వర్షపునీరు
  • తుంగతుర్తి నుండి వెలుగుపల్లి మీదుగా రవాణా బంద్

తుంగతుర్తి ముద్ర:- రాష్ట్రవ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఒకపక్క రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జలమయం అవుతుండగా అదే రీతిలో తుంగతుర్తి నియోజకవర్గంలో పలు చెరువులు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలని పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి. చెరువుల అలుగుల వరదతో పరివాహక ప్రాంతంలోని పొలాలు జలమయమయ్యాయి .నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని చెరువులన్నీ వర్షపు నీటితో నిండి కళకళలాడుతున్నాయి.

గత నాలుగైదు సంవత్సరాల కాలంగా గోదావరి జల్లాలతో నిండిన చెరువులనే రైతులు చూశారు తప్ప వర్షంతోన చెరువులను ఈ వర్షాకాలంలో చూస్తున్నామని రైతులంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో గోదావరి జల్లాలు రాక ఆందోళన చెందుతున్నట్లు కురిసిన భారీ వర్షాల వల్ల అలుగులు పోస్తున్న చెరువులను చూసి మనోధైర్యం వచ్చిందని రైతులు చెబుతున్నారు . తుంగతుర్తి నుండి మద్దిరాల వైపు వెళ్లే రహదారిపై తుంగతుర్తి సమీపంలోని వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో రాకపోగల కొంతమేర ఇబ్బంది కలుగుతుందని స్థానికులు చెబుతున్నారు .ఎక్కడ చూసినా వరద నీరు కనిపిస్తుంది.

నీట మునిగిన పంట పొలాలు పొంగిపొర్లుతున్న వాగులు వంకలు కనిపిస్తున్నాయి. ఈ వర్షం ఇలాగే మరొకటి రెండు రోజులు కొనసాగితే మాత్రం పలు చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అప్రమత్తమై ప్రమాదకర స్థాయిలో ఉన్న కుంటలను పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు .శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఏకధాటిగా ఉరుములతో కూడిన భారీ వర్షం కురవడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ఏది ఏమైనా భారీ వర్షానికి తుంగతుర్తి ప్రాంతం అతలాకుతలమవుతుందని తెలుస్తోంది. వెలుగు పల్లి కేశవాపురం మధ్య బంధం పొంగి పొరలుతోంది. కేశవాపురం గ్రామానికి రాకపోకలు బంద్ అయ్యాయి .రానున్న ఒకటి రెండు రోజులు ఇంకా వర్షాలు రాకుండా వాతావరణ శాఖ తెలుపుతున్న వాతావరణం ఏ విధంగా మారుతుందో అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అప్రమత్తమై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech