సూర్యాపేట ముద్ర ప్రతినిధి :-తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య అధ్యక్షులుగా ప్రముఖ పారిశ్రామికవేత్త, గుత్తా అమిత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల ఈ పదవి కాలానికి గాను నియమింపబడ్డ అమిత్ రెడ్డి సీనియర్ రాజకీయ నాయకులు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుత్తా ఫౌండేషన్ ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో అమిత్ రెడ్డి అందించారు. అమిత్ అన్నా అంటే నేనున్నా అంటూ పేదలను అక్కున చేర్చుకుని ఎందరో అభాగ్యులను చేరిన మానవతా హృదయం కలవారు అమిత్ రెడ్డి అని ప్రతీతి. ఎప్పుడు చలాకీగా ఉంటూ ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రత్యక్షమై తన సొంత ఖర్చులతో ఆయా సమస్యలను అమిత్ రెడ్డి పరిష్కరించేవారు కాదు. తన తండ్రి, సీనియర్ రాజకీయవేత్త, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సేవా దృక్పథాన్ని, మానవతా హృదయాన్ని అలవర్చుకున్న అమిత్ రెడ్డి తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పరస్పర సహకారం ,సేవా భావంతో సమాజ సేవలో తన వంతు పాత్రను అమోఘంగా నిర్వహిస్తున్నారు.
అమిత్ రెడ్డి స్వార్థ రహిత సేవా భావాన్ని గుర్తించిన ప్రభుత్వం ఆయనకు తగు ప్రాధాన్యమిస్తూ రాష్ట్రస్థాయి పదవిని కట్టబెట్టడం అమిత్ రెడ్డి ఉన్నత వ్యక్తిత్వానికి గీటురాయి. అమిత్ రెడ్డికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి రావడం పట్ల ప్రముఖ పారిశ్రామికవేత్త, సామాజిక సేవకులు చలసాని శ్రీనివాసరావు, చలసాని రాజన్న ఫౌండేషన్ చైర్మన్ ప్రముఖ ఎన్నారై చలసాని రాజీవ్, ఆయన అభిమానులు, రాజకీయ నాయకులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.