- అనుకున్నట్టే రైతు రుణమాఫీ
- తొలి విడుతలో 11.50 లక్షలు
- రెండో విడుతలో 6.40 లక్షలు
- మూడో విడుతలో 4.46 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ
- త్వరలోనే మళ్లీ కొత్త రుణాలు
ముద్ర, తెలంగాణ బ్యూరో:-రైతుల రుణమాఫీలో దేశంలోనే తెలంగాణ సరికొత్త రికార్డు సృష్టించింది. మూడు విడతల్లో మొత్తం రూ. 17,934 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేసింది.మొదటి విడతలో 11,50,193 మంది రైతులకు, రూ.6098.93 కోట్ల నిధులను జమ చేయగా, రెండో విడతలో 6,40,823 మంది రైతులకు, రూ.6190.01 కోట్లు, మూడో విడతలో 4,46,832 మంది రైతులకు రూ.26,832 మంది. జమ చేసింది.
ఇలా మూడు విడతల్లో 22,37,848 మంది రైతులు రుణమాఫీకి నోచుకున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు అయింది. ఆగస్ట్ 15లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి నెల రోజుల ముందే ఈ పని చేసి చూపించారు.
మొత్తం రాష్ట్రంలో 3.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు రూ.31 వేల కోట్ల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి దేశంలోనే కొత్త రికార్డు నెలకొల్పింది.ఈ రుణమాఫీకి చెందిన జీవోను గత నెల 15వ తేదీన జారీ చేసిన ప్రభుత్వం మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయటం మొదలు పెట్టింది. మొదటి విడతగా లక్ష రూపాయల వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నీ ఏకకాలంలో రుణమాఫీ చేయగా, అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం అమలులో ఉంది. ఒక లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణమున్న రైతు కుటుంబాలకు రుణ విముక్తులను చేసింది.
ఆగస్టు 15వ తేదీన లక్షలాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభపై ముఖ్యమంత్రి రాష్ట్రంలోని రైతులకు అసలైన స్వరాజ్యం వచ్చిందని.. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు రూ.2 రుణమాఫీ ప్రకటించారు. అంటే కేవలం 27 రోజుల్లోనే దాదాపు 22.37 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు రూ.18 వేల కోట్ల రుణమాఫీ నిధులు జమ చేయడం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం. మూడో విడతలో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ అవుతాయి. ఆ రైతు కుటుంబ బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. దీనితో రుణమాఫీలో కీలక ఘట్టం ముగియనుంది. ఇకరూ.2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు చివరి విడతగా నిధులు కేటాయించిన రుణమాఫీ విధి విధానాల్లో ప్రభుత్వం ముందుగానే వెల్లడించిన విషయం తెలిసిందే.