- గంటకు పైగా దేవాలయంలోనే దొంగ
- భద్రతా సిబ్బంది వైఫల్యం
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. రాత్రి దాదాపు 10 గంటల సమయంలో దేవాలయంలోకి చొరబడ్డ దొంగ అంతరాలయంలోని హుండీలను పగలగొట్టాడు. అందులో భాగంగా చోరీ చేశాక ప్రధాన హుండీని కూడా పగలగొట్టేందుకు ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నం ఫలించలేదు. రాత్రి 10 20 కి అంతరాలయంలోకి చొరబడ్డ దొంగ రాత్రి 11:40కి బయటకు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది.
ఇంతసేపు అంతరాయంలో దొంగ ఉన్నా సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. దేవాలయంలోకి చొరబడే సమయంలో సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. గతంలో మానసిక స్థిరత్వం లేని ఒక వ్యక్తి దేవాలయంలో చొరబడి కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్ సిబ్బంది ఈ దేవాలయంలో భద్రతా వైఫల్యం ఉందని నివేదికను సమర్పించారు. ఇంత జరిగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టకపోవడం అధికారులు నిర్లక్ష్యానికి మచ్చుతునకగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.