Home తెలంగాణ కాంగ్రెస్ కు పేరొస్తుందనే రాజీవ్, ఇందిరాసాగర్ ల రీడిజైన్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

కాంగ్రెస్ కు పేరొస్తుందనే రాజీవ్, ఇందిరాసాగర్ ల రీడిజైన్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
కాంగ్రెస్ కు పేరొస్తుందనే రాజీవ్, ఇందిరాసాగర్ ల రీడిజైన్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • వైఎస్ హయాంలో ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన
  • కమీషన్ల కక్కుర్తి కోసం పక్కనబెట్టిన బీఆర్ఎస్
  • రూ.3,605 కోట్లతో ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవి
  • కానీ గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టి రూ. 18,286 కోట్లకు పెంచింది
  • బీఆర్ఎస్ హయాంలో 39శతమే సీతారామ పనులు
  • కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొంత భూభాగం ఏపీకి వెళ్లింది
  • జలసౌదలో మీడియాతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం మాదిరిగానే రాజీవ్, ఇందిరాసాగర్ వ్యయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాలుగింటలుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజీవ్‌సాగర్‌, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గుర్తు చేశారు. కానీ కమీషన్ల కక్కుర్తి కోసం, ప్రాజెక్టును పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పేరు వస్తుందనే దురుద్దేశ్యంతో గత బీఆర్‌ఎస్‌ సర్కార్ ఆ ప్రాజెక్టును పక్కనపెట్టింది. తర్వాత రీడిజైన్‌ చేసి పనులు ప్రారంభించిన గత సర్కార్‌ ప్రాజెక్టుల పేర్లు మార్చి రీడిజైన్‌ చేసి నిర్మాణ వ్యయాన్ని నాలుగింతలు చేసింది.

రూ.3,505కోట్లతో పూర్తి కావాల్సిన ఆ రెండు ప్రాజెక్టులను వ్యయాన్నిరూ.18,286 కోట్లకు చేర్చిందని తెలిపారు. తాజాగా శాఖ పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి మంగళవారం జలసౌధలో మీడియాతో మాట్లాడిన ఉత్తమ్.. బీఆర్ఎస్ పాలన తీరుపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొంత భూభాగం ఏపీకి వెళ్లిందని ఆరోపించిన ఆయన అప్పుడే రాజీవ్‌సాగర్‌ ప్రాజెక్టుకు రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వచ్చింది. కాంగ్రెస్ పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేశామంటూ బీఆర్ఎస్ నాయకులు హాస్యాస్పదమన్నారు. రూ.19 వేల కోట్ల వ్యయంతో కూడిన ఆ ప్రాజెక్టులో రూ.7436 కోట్లు మాత్రమే చేశారన్నారు. వాస్తవానికి గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పనులు 39 శాతం చేపట్టామని చెప్పారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి జలాల కోసం ప్రాజెక్టు చేపట్టామని, ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతిని సాధించినట్లు బీఆర్‌ఎస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఇప్పటికీ ఆ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి రాలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక నీటి పారుదల శాఖకు అధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయిస్తున్నామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు సీతారామ ప్రాజెక్టు మూడు పంపులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మొత్తం రూ.1.81 లక్షల కోట్లతో నామమాత్రంగా ఆయకట్టుకు సాగునీరు ఇచ్చిన గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టి లక్ష ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేదని. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదని ఆక్షేపించారు. పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ఉత్తమ్ జిల్లాలో. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి. ఎస్‌ఎల్‌బీసీ టన్నె పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.సీతారామ ప్రాజెక్టుకు రూ.7,436 కోట్లు కోట్లు చేసి, ఒక్క కరానికీ నీళ్లు ఇవ్వలేదని దుయ్యబట్టారు.కాంగ్రెస్ పార్టీ హయాంలో నీటి పారుదల శాఖకు అధిక నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech