- 53 సంఘాలు చేరిక
- సర్కార్ కు ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆల్టీమేటం
- 36 తీర్మానం
- అనేక శాఖలకు ఒకటో తేదిన అందని జీతాలు .. 15 రోజుల్లో కార్యాచరణ
- మీడియాతో ఉద్యోగ జేఏసీ నేతలు
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం, మెనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు, హామీల అమలు కోరుతూ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ ఆందోళనకు సిద్ధమైంది. బకాయి పడ్డ డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ రద్దు, వేతనాలతో పాటు పలు సమస్యల సాధన కోసం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు హమీలేవీ అమలుకు నోచుకో కాంగ్రెస్ సర్కార్ పనితీరుపై రగిలిపోతున్న ఉద్యోగులు 15 రోజుల్లో ఉద్యమ కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ లోని నాంపల్లి లో ఉన్న జేఏసీ ఆ సంఘ నేతలు భేటీ అయి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన జేఏసీ చైర్మన్ జగేశ్వర్.. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏర్పాటు చేసినట్లుగా ఇప్పుడు మళ్లీ తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జేఏసీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉద్యోగ సంఘాలతో సమావేశం అవుతామని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నేతలు విస్మరించారని తెలిపారు. ఇప్పుడు తమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం, సీఎం సిద్ధంగా లేనట్లు అనిపిస్తుందని అభిప్రాయపడ్డారు. సీఎం, ప్రభుత్వం చెబుతున్నట్టు ఒక’టోన్‌లో జీతాలు ఇస్తున్నారనీ కానీ ఇంకా కొన్ని డిపార్ట్‌లో జీతాలు ఒకటో తేదీన రావడం లేదని ఆయన స్పష్టం చేశారు.
కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకించాలని డిమాండ్ చేశారు. భాగ్యనగర్ సొసైటీ, ఇతర సొసైటీ భూములను మాకు అప్పగించాలని కోరిన జేఏసీ నేతలు త్వరలోనే అన్ని జిల్లాలో తిరిగి ఉద్యోగులందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారు. ఎన్నికల ముందు పీఆర్సీ, డీఏ ఇస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఊసే ఎత్తడం సహాయం. గ’తంలో రెండు డీఏలు ఇవ్వకుంటేనే ధర్నాలు చేసేవాళ్లమన్న ఆయన , ఇప్పుడు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నా ఇప్పటివరకు ఆ నిర్ణయం తీసుకోలేదు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ వెంటనే అమలు చేసింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టిందనీ అయినా ఆ మేరకు ఎలాంటి ప్రయత్నం చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ వెంటనే హెల్త్ స్కీం అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తమకు కంట్రిబ్యూషన్ కింద హెల్త్ స్కీం కోసం జీవో ఇచ్చిందనీ అయినా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. ఈ సమావేశంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, గెజిటెడ్ ఆఫీసర్లు, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్టు కార్మికుల సంఘం నేతలు పాల్గొన్నారు.
====================