ముద్రా ప్రతినిధి, కరీంనగర్ :కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన కావేటి పరమేశ్వర్ గురు స్వామికి అయ్యప్ప సేవా రత్న అవార్డును ప్రధానం చేశారు. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో జరిగిన “అఖిల అయ్యప్ప ధర్మ ప్రచార సభ” జాతీయ సమావేశాల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 18 మంది గురుస్వాములకు అయ్యప్ప సేవా రత్న అవార్డులను అందించారు. ఫౌండర్, మేనేజింగ్ ఫౌండర్ ట్రస్ట్రీ పి.ఎన్.కె మీనన్, అధ్యక్షుడు అయ్యప్ప దాస్, ప్రధాన కార్యదర్శి బేతి తిరుమలరావు ఆధ్వర్యంలో శబరిమల అయ్యప్ప దేవాలయ మాజీ మేల్ శాంతులు శశికుమార్, దామోదరన్ నంబూద్రీ అయ్యప్ప సేవా రత్న అవార్డును కావేటి పరమేశ్వర్ స్వామికి అందించారు. ఈ సందర్భంగా కావేటి పరమేశ్వర్ గురుస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో కరీంనగర్ జిల్లాలో అయ్యప్ప మాలధారణ చేసే స్వాములు, అయ్యప్ప సేవ సమితి సభ్యుల ఆశీస్సులు, సహకారంతోనే ఈ అవార్డు లభించింది.
అవార్డు రావడం సంతోషకరంగా ఉందని, ముఖ్యంగా ఈ అవార్డును జీవిత భాగస్వామి కావేటి శైలజ, కరీంనగర్ అయ్యప్ప భక్తులకు అంకితమిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. నిరంతర అయ్యప్ప స్వామి నామస్మరణతో మరింతగా అయ్యప్పకు సేవ అందించడం, మాలధారణ చేపట్టే అయ్యప్పలకు తగిన తోడ్పాటు అందించడం, సేవ చేయడానికి తగిన కృషి చేస్తానని గురుస్వామి కావే పరమేశ్వర్ ఈ సందర్భంగా తెలిపారు. తన సేవను గుర్తించి అవార్డును అందించిన కమిటీకి, సీనియర్ గురుస్వాములకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.