- మీరు ఆర్డర్ చేస్తే.. మేము రిబ్బన్ కట్ చేశామా…?
- హరీశ్ రావు వ్యాఖ్యల పై మంత్రి పొన్నం కౌంటర్
ముద్ర, తెలంగాణ బ్యూరో : తమ పాలనలో రాష్ట్రంలో అయిన అప్పులకు బాధ్యత వహించలేదు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు కాంగ్రెస్ హయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తున్న నిధులు తమవే అని డబ్బా కొట్టుకుంటున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇరిగేషన్, ఆర్దిక, మార్కెటింగ్, మైనింగ్, ఆరోగ్య శాఖ మంత్రిగా అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో కీలక పాత్ర పోషించిన హరీష్ రావు ఇప్పుడు కాల్ సెంటర్‌లో కహానీలు చెప్తున్నారని చెప్పారు.అప్పుడు కలెక్షన్స్ సెంటర్లు ఏర్పాటు చేసుకున్న ఆయన ఇప్పుడు కాల్ సెంటర్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేపు రోడ్డు సెంటర్ లో నిలబడాల్సి వస్తుందని చురకలంటించారు. రుణమాఫీపై హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆయన హరీష్ రావు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అరకొరగా చేసిన పంట రుణమాఫీ కూడా మూడు లక్షల మంది అర్హులైన రైతులకు అమలు కానందుకు.
సాంకేతిక సమస్యలు చూపించి ఆ రైతులకు రుణాలు మాఫీ చేయలేదనీ ఆ విషయం హరీష్ రావుకు కూడా తెలుసు. బీఆర్‌ఎస్ హయాంలో పంటల బీమా లేదని రైతులకు పంట నష్టపరిహారం అందడంతో పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. హైదరాబాద్ వంటి రైతులు అడ్డా మీద కూలీలుగా మారారు. అప్పుడే కాల్ సెంటర్ పెట్టి ఉంటే రైతులకు ఎంతో కొంత లబ్ధి జరిగేదని సెటైర్లు వేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు కాల్ సెంటర్ పెడితే ఏం లాభమని ప్రశ్నించారు. తాము ఆర్డర్ చేస్తే మేము రిబ్బన్ కట్ చేశామని చెబుతున్న బీఆర్‌ఎస్ నేతలు వారి పాలనలో ఒక్క బస్సు అయినా కొనుగోలు చేశారా..? అని ప్రశ్నించారు. ఒకవేళ అదే నిజమైతే మీకే క్రెడిట్ తెచ్చిన పొన్నం మీరు రూ. ఆరు లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు ఎవరు చెల్లిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఆ వడ్డీలు కూడా మీరే చెల్లించి ఆ క్రెడిట్ కూడా మీరే తీసుకోండని హరీష్ రావుకు సూచించారు.