Home తెలంగాణ డేంజర్ లో తుంగభద్ర – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

డేంజర్ లో తుంగభద్ర – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
డేంజర్ లో తుంగభద్ర - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • వరద నీటికి కొట్టుకుపోయిన డ్యాం 19వ గేటు
  • తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టం
  • డ్యామ్‌లో 60 టీఎంసీలు ఖాళీ చేస్తేనే మరమ్మతులకు అవకాశం
  • ఇప్పటికే 29 గేట్ల ద్వారా లక్ష 8 వేలు క్యూసెక్కులు విడుదలయ్యాయి
  • తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడం బాధకరం- డీకే శివకుమార్
  • ఖచ్చితంగా గేటు పునరుద్ధరణ చేస్తాం- కర్ణాటక డిప్యూటీ సీఎం.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి జలశయం, వరప్రదాయిని తుంగభద్ర డేంజర్‌లో పడింది. గత కొన్ని రోజులుగా జలశయంలో పోటెత్తిన వరదతో నీటిని దిగువకు వదిలిపెట్టిన డ్యాం అధికారులు వరద తగ్గడంతో శనివారం రాత్రి 11 గంటల సమయంలో కర్ణాటకలోని హోస్పేట్‌లో గల తుంగభద్ర జలశయం గేట్లను మూసివేసేందుకు ప్రయత్నించారు. ఈ వరద 33 గేట్లలో 19వ గేటు నీటి దాటికి చైన్ లింక్‌ తెగి కొట్టుకుపోయింది. దీంతో ఆ గేటు నుంచి ఇప్పటివరకు లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు వెళుతుంది. దీంతో ఏం చేయాలో తోచక కర్ణాటక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఈ ప్రమాదంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఇరు రాష్ట్రాల అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తుంగభద్ర డ్యామ్‌లో ప్రస్తుతం నిల్వ ఉన్న 60 టీఎంసీల నీళ్లు ఖాళీ చేస్తే మరమ్మతులకు అవకాశం ఉంటుందని డ్యాం అధికారులు అక్కడికి నివేదించారు. ఈ కర్ణాటక సర్కార్ లక్ష ప్రకారం ఇప్పటికే 29 గేట్ల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసింది. డ్యాం నీళ్లు పూర్తిగా ఖాళీ అయ్యేందుకు ఐదారు రోజులు పడుతుందని డ్యాం అధికారులు తెలిపారు.

ఒకవేళ తుంగభద్ర మొత్తం ఖాళీ అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉమ్మడి మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలపై తీవ్ర ప్రభావం పడనుంది. సాగునీటికి ఇప్పటికే ఉంది.కి ఇబ్బంది పడే అవకాశం ఇదీలావుంటే.. సీడబ్ల్యూసీ చైర్మన్ రవీంద్ర, డిప్యూటీ సీఎం శివకుమార్, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, విరుపాక్షి తుంగభద్ర డ్యామ్ ను పరిశీలించారు. ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ధ్వంసం కావడం బాధాకరం అన్నారు. తుంగభద్ర డ్యామ్ కర్నాటక, ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు వర ప్రదాయిని అని చెప్పారు. తుంగభద్ర డ్యామ్‌లో 40 టీఎంసీల నీరు నిల్వ ఉంచి.. మిగిలిన నీటిని విడుదల చేస్తే గేటు మరమ్మతులకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరగా గేటు పునరుద్ధరణ చేస్తామనీ, ఈ ఏడాది ఖరీఫ్ పంటకు మాత్రమే నీళ్లు అందేలా చూస్తామని చెప్పారు. రబీ పంటకు నీరు అందించడం కొంచెం కష్టమేనన్న డీకే శివకుమార్ సహకరించాలని రైతులను వివరించారు.

ప్రమాదంపై ఏపీ అప్రమత్తం…

తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ముందుగా ఆ రాష్ట్ర నీటిపారుదలశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి పయ్యావుల కేశవ్‌లతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు అక్కడ తాత్కాలిక గేటును ఏర్పాటు చేసి తుంగభద్ర డ్యామ్ అధికారులతో మాట్లాడాలని సూచించారు. ఆ విషయంలో తుంగభద్ర డ్యాం అధికారులకు పూర్తి సహకారం అందించాలని మంత్రి పయ్యావుల కేశవ్ ను సీఎం చేశారు. తుంగభద్ర డ్యాం అధికారులతో మాట్లాడిన మంత్రి పయ్యావుల కేశవ్ తాత్కాలికంగా స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయడానికి ఇబ్బందులు ఉన్నాయని చంద్రబాబుకు వివరించారు. ఆ డ్యాం 1960లో నిర్మించిన పాత డిజైన్ కావడంతో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొందని కేశవ్ తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech