ముద్ర, తెలంగాణ బ్యూరో:- రాష్ట్రంలో సంచలనం రేపిన జీఎస్టీ కుంభకోణంలో ఏ-5 నిందితుడిగా ఉన్న మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. ఆయనతో పాటు మరికొందరు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని సచివాలయ వర్గాల్లో వినిపిస్తోంది.
వాణిజ్య పన్నుల శాఖకు కమిషనర్ గా వ్యవహరించిన సోమేశ్ కుమార్ కనుసన్నల్లోనే హైదరాబాద్ ఐఐటీ రూపొందించిన సాఫ్ట్ వేర్ ఆధారంగా ప్రభుత్వానికి నిధులు రావాల్సిన పక్కదారి పట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే. దీంతో సోమేశ్ తో సహా మొత్తం ఐదుగురిపై పలు సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కుంభకోణంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు నిందితులను త్వరలోనే అరెస్ట్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నిందితులకు త్వరలోనే నోటీసులు ఇచ్చి వారిని అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.