Home తెలంగాణ ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపు – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపు – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపు – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర. వీపనగండ్ల:- 2018 డిసెంబర్ 12 నుంచి రాష్ట్ర ప్రభుత్వం విధించిన 2023 డిసెంబరు 9 కటాఫ్ తేదీ వరకు రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయడం జరుగుతుందని ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన కటాఫ్ తేదీలలో స్థానిక ఇండియన్ ఓవర్సీ బ్యాంకు నుంచి పంట రుణాలు తీసుకున్న చాలామంది రైతులకు రుణమాఫీ వర్తించలేదని బ్యాంకు పరిధిలోని రైతులు మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్లేందుకు బుధవారం సాయంకాలం మంత్రి జూపల్లిరావు బ్యాంకులో మేనేజర్ రవీందర్ బాబు సమస్యను అడిగి తెలుసుకున్నారు.

లక్ష లోపు రుణాలు పొందిన రైతులు 2972 ​​మంది రైతులు ఉండగా అందులో 1167 మందికి రుణమాఫీ వర్తించిందని అయితే కొంత సాంకేతిక కారణాల వల్ల వారి ఖాతాలోకి జీరో నెంబర్ యాడ్ కాకపోవటంతో అట్టి వారి ఖాతాలో జమ కాలేకపోయాయని వారి ఖాతాలో అధికారులు దృష్టికి తీసుకెళ్లడం వల్ల సమస్య పరిష్కారం అయిన వెంటనే వారి ఖాతా పంట రుణమాఫీ జమ అవుతుందని ఎలాంటి ఆందోళన వ్యక్తం చేశారు. చెందాల్సిన అవసరం లేదని మేనేజర్ మంత్రి జూపల్లికి వివరించారు. ఒక 50 వేల లోపు రుణాలు పొందిన రైతులు 1055 మంది ఉండగా అందులో 508 మంది రైతులకు రుణమాఫీ వర్తించడం, 547 మందికి కాలేదని వీరిలో కొందరికి రేషన్ కార్డు లేకపోవడం, ఆధార్ కార్డులో నంబర్, పేర్లు తప్పుగా ఉండటం వంటి సాంకేతిక కారణాలు లక్ష ఉన్నాయని, రెండు లక్షల రుణమాఫీకి 484 మంది రైతులు అర్హత మేనేజర్ పొందారని రవీందర్ బాబు అన్నారు.

బ్యాంకులో ఏడు గ్రామాలకు చెందిన సుమారు 4800 మంది రైతులకు 36 కోట్ల 83 లక్షల రూపాయల పంట రుణాలు అందజేయడం జరిగిందని మేనేజర్ మంత్రికి వివరించారు. రైతులకు సంబంధించిన పంట రుణమాఫీలో ఏమైనా సమస్యలు ఉంటే బ్యాంకు అధికారులు సమన్వయం చేసుకొని సరిచేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగని వ్యవసాయ అధికారి డాకేశ్వర్‌గౌడ్‌కు వివరించారు. పంట రుణమాఫీ గురించి అడగటానికి వచ్చే రైతులకు ఎంత రుణమాఫీ అయినది, అందుకే రుణమాఫీ కాలేదో వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాల్సి ఉంటుందని రైతులపై అధికారులు విసిగించుకోవద్దని మంత్రి సూచించారు.

2023 డిసెంబర్ 9 వరకు మాత్రమే వడ్డీతో సహా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరుగుతుందని, డిసెంబర్ 9 నుంచి నేటి వరకు రైతులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. గ్రామాల్లోని ప్రతి కార్యకర్త పంట రుణమాఫీ గురించి రైతుల ఇండ్లకు వెళ్లి అర్థమయ్యే రీతిలో రైతులకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోదల బీరయ్య, వనపర్తి జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు ఇంద్రకంటి వెంకటేష్, పానగల్ సింగిల్ విండో మాజీ అధ్యక్షులు బాల్ రెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, వీపనగండ్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విష్ణు, నాయకులు బొల్లారం సుదర్శన్ రెడ్డి,కాల్వరాల నరసింహ, చక్ర వెంకటేష్. గోపి, రవీందర్ రెడ్డి, వెంకట స్వామి, రాజశేఖర్, బాలపీర్, రాజు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech