- తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు గద్దర్..సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్నే అంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం.. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఎక్స్ వేదికగా ప్రొఫెసర్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా గతంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడాన్ని జయశంకర్ వ్యతిరేకించారని చెప్పారు. ఏపీలో విలీనంతో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఆరు దశాబ్దాలు సజీవంగా ఉంచిన బఘనత ఆయనదేనని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలుగా జీవిత పర్యంతం గడిపిన ప్రొఫెసర్ జయశంకర్‌ను తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని బతెలిపారు.
తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టు గద్దర్..!
తెలంగాణ ఉద్యమానికి ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఆయువుపట్టని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. గద్దర్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా… పోరు తెలంగాణమా అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచిన వ్యక్తి గద్దర్ అని సీఎం కొనియాడారు. పేద కుటుంబంలో పుట్టి ఇంజినీరింగ్ విద్యను అభ్యసించిన గద్దర్ ఉన్నత కొలువుల వైపు దృష్టిసారించకుండా ప్రతి ఒక్కరికి కూడు, గూడు, నీడ లభించడానికి లక్ష్యంతో జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్యపర్చారని సీఎం ప్రకటించారు. తెలంగాణ జన సమితి, తెలంగాణ జన సభతో పాటు పలు ఉద్యమ సంస్థల ఏర్పాటుతో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరులూదిన వారిలో అగ్రగణ్యుడు గద్దర్ అని సీఎం గుర్తు చేశారు. పాటను తూటాగా మార్చిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ అని, ఆయన చేసిన సాంస్కృతిక, సాహితీ సేవకు గుర్తింపుగా తమ ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చింద రేవంత్ రెడ్డి తెలిపారు.