సీఎం రేవంత్ రెడ్డి అమెరికాకు చేరుకున్నారు. ఈ మేరకు న్యూయార్క్ ఎయిర్ పోర్టులో అభిమానులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 14 వరకు దాదాపు 10రోజులు అమెరికాలో ఆయన ఉండనున్నారు. ప్రధానంగా అమెరికాలోని న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, న్యూజెర్సీలో ఇస్తారు. ఆ తర్వాత దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు తీసుకొచ్చేందుకు అమెరికా పర్యటనకు సీఎం రేవంత్ వెళ్లారు. ఆయనతోపాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉన్నారు. పర్యటనలో భాగంగా 8 రోజులు అమెరికాలో, రెండు రోజులు దక్షిణ కొరియాలో ఉండనుంది.ఈ పర్యటనలో భాగంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. అయితే సీఎంగా బాధ్యత తీసుకున్న తర్వాత పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉండటం ఇది రెండోసారి కావడం విశేషం.
ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డ అమెరికా పర్యటన అనంతరం మంత్రి వర్గ విస్తరణ ఉండనుంది. ఈ నెల 14న రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలతో చర్చించిన సమాచారం. క్యాబినెట్లో 6 ఖాళీలు ఉండగా..మంత్రి వర్గంలోకి ప్రస్తుతం నలుగురిని తీసుకోనున్నారు. మిగిలిన రెండు బెర్తుల కోసం వివిధ సమీకరణల ప్రకారం..భర్తీ చేయాలన్నారు. అయితే క్యాబినెట్ విస్తరణ జరిగిన వెంటనే పీసీసీ చీఫ్‌ను కూడా నియమిస్తారని సమాచారం