- సీఎంను, నన్ను కించపరచడం వలనే సహనం కోల్పోయా
ముద్ర, తెలంగాణ బ్యూరో : శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో తనను కావాలనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఈ మేరకు శనివారం హైదరాబాద్ ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం మీడియాతో మాట్లాడుతూ.. సభలో హైదరాబాద్ అభివృద్ధిపై తనకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారని , బయటకు చెప్పలేని పదాలతో దూషించారని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలు రికార్డు కా. సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తనను కించపరిచే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడడంతో తాను సహనం కోల్పోయి ఆ విధమైన వ్యాఖ్యలు చేశానని ఆయన చెప్పారు. తాను హైదరాబాద్ వాడుక భాషలోనే వ్యాఖ్యలు చేశానని ఆయన సమర్థించుకున్నారు. ఆ వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలిగిస్తే క్షమాపణ చెబుతున్నా అని అన్నారు. అధికారం కోల్పోవడం వల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆవేదనతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి బీఆర్ఎస్ సభ్యులు సభను సజావుగా నడవకుండా అడ్డుకుంటున్నారని ఆయన చెప్పారు.