6
ముద్ర, తెలంగాణ బ్యూరో : నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 4.94 లక్షల క్యూసెక్కులుగా ఉంది. అవుట్ ఫ్లో 27,238 క్యూసెక్కులుగా ఉంది. జలశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 563.60 అడుగులు ఉన్నాయి. డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీకాలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 240.83 టీసీలుగా ఉంది. సాగర్ కుడి కాలువకు 6,324 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1418, ఎల్ఎల్బీసీ (ఏఆర్ఎంపీ)కి మరో 1800 క్యూసెక్కులు విడుదల అవుతున్నాయి.