- స్థానిక సంస్థల ఎన్నికల వరకు జిల్లా పర్యాటక శాఖ అధికారిగా కొనసాగుతున్నారు
- ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ
- కల్వరాల గ్రామ వాసికి జిల్లా స్థాయిలో ప్రాధాన్యత కల్పించిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
ముద్ర. వీపనగండ్ల:-నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారిగా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన నరసింహ కు నాగర్ కర్నూలు జిల్లా పర్యాటక శాఖ అధికారిగా నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. కొల్లాపూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యానుచరుడుగా ఉన్న కల్వరాల నరసింహులు స్థానిక సంస్థల ఎన్నికల వరకు పదవిలో కొనసాగేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకం ఉంచి నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటకశాఖ అధికారిగా నియమించడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పర్యాటశాఖ మంత్రి జూపల్లికి కాల్వరాల నరసింహ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావు అనుచరుడుగా ఉంటూ కొద్దికాలంలోనే కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాల్వరాల నరసింహ ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోదాల బీరయ్య, వనపర్తి జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు ఇంద్రకంటి వెంకటేష్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, మండల నాయకులు నారాయణరెడ్డి, ఎత్తం కృష్ణయ్య , బొల్లారం సుదర్శన్ రెడ్డి, రఘునాథ్ రెడ్డితోపాటు మండల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు అభినందించారు.
చిన్న వయసులోనే నరసింహ కు జిల్లాలో పర్యాటకశాఖ అధికారిగా పదవి రావడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. రానున్న రోజుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జిల్లా పర్యాటక శాఖ అధికారిగా నియమించిన నరసింహ కు సోమశిల, ఉమ మహేశ్వరం, మల్లెల తీర్థం, అమ్రాబాద్, మన్ననూర్, శ్రీశైలం, నల్లమల ప్రదేశం పరిసరాల్లో పర్యాటక శాఖ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.