- సింగోటం చెరువు పరిశీలన
- అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శన..
నాగర్ కర్నూల్ జిల్లా: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ,గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సింగోటం గ్రామ తనిఖీ సందర్భం ఈ విధంగానే స్వయంభు లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు కలెక్టర్ బాదావత్ సంతోష్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జిల్లా కలెక్టర్ ,శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం చుట్టూ కలెక్టర్ ప్రదక్షిణలు చేశారు. దర్శనానంతరం అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు.
అనంతరం కలెక్టర్ సింగోటం చెరువును పరిశీలించారు. చెరువులో ఉన్న నీటి నిలువ అడిగి తెలుసుకున్నారు. చెరువు ద్వారా ఎన్ని గ్రామాలకు సాగునీరు అందుతుందని అధికారులతో అడిగి తెలుసుకున్నారు. చెరువు కింద ఎంత ఆయకట్టుకు సాగునీరు అందించారు. చెరువు కింద ఉన్న రైతులకు రెండు పంటలకు కావలసిన సాగునీటి లభ్యత గురించి అధికారులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు.
అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అంగన్వాడి వైద్యం అందించే బాలామృతం, గుడ్లను పరిశీలించారు. గుడ్ల నాణ్యతను పరిశీలించాలని సూచించారు. అంగన్వాడి చిన్నారులకు ఆటపాటలతో బోధన సాగాలని సూచించారు.ప్రతిరోజు తప్పనిసరిగా చిన్నారులు అంగన్వాడికి హాజరు అయ్యేలా చూడాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం తదితరాంశాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. అంగన్వాడీ ప్రాంగణంలో కిచెన్ గార్డెను ఏర్పాటు చేసిన కలెక్టర్. పల్లె దవాఖాన సిబ్బందితో కలెక్టర్ మాట్లాడుతూ ఆశావర్కర్లు, ఏఎన్ఎంలు గ్రామాల్లో ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఈ నెలలో ఆశ వర్కర్లు ఎంత మంది పల్లెదవ ఖానాలో విధులు నిర్వహిస్తున్నారని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.కలెక్టర్ వెంట కొల్లాపూర్ ఆర్డీవో నాగరాజ్, కొల్లాపూర్ తహసీల్దార్ విష్ణువర్ధన్, ఎంపీడీవో మనోహర్, ఉన్నారు.