12
హైదరాబాద్లో కదులుతున్న బస్సులో దారుణం చోటుచేసుకుంది. నిర్మల్ నుంచి ప్రకాశం వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఓ మహిళపై అత్యాచారం చేశాడు డ్రైవర్. నోట్లో బట్ట కుక్కి అత్యాచారం చేశాడు. మేడ్చల్ సమీపంలో ఉండగా బాధిత మహిళ డైల్ 100కి కాల్ చేసింది.వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది చాకచక్యంతో ఓయూ పరిధిలో వేగంగా కదులుతున్న హరికృష్ణ ట్రావెల్స్ బస్సును పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని బాధిత మహిళను కాపాడారు. కాగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.