ముద్ర,హైదరాబాద్:-నగరంలో మెట్రో రైళ్ల రాకపోకలు ఉదయం 5.30 గంటల నుంచే మొదలవుతున్న మెట్రో అధికారులు. మెట్రో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య రోజుకు పెరుగుతోంది. దానికి తోడు ప్రస్తుతం ఉన్న సమయాలను పొడిగించాలని నగర వాసులు కోరుతున్నారు. ఈనేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెట్రో రైళ్ల వేళలను పొడిగించాలని అధికారులు నిర్ణయించారు.
ముఖ్యంగా సోమవారం నుంచి శుక్రవారం ఐటీ ఉద్యోగుల మెట్రో రైళ్లలోనే ఎక్కువగా ప్రయాణించడం వల్ల శుక్రవారం ఉదయం 5.30 నుంచి మెట్రో రైలును నడిపామని, ఆ సమయంలో ప్రయాణీకుల ఆదరణ ఉంటుందని ఇక నుంచి ప్రతి రోజు ఉదయం 5.30 గంటల నుంచే నిర్ణయించామని చెప్పారు. మెట్రో రైళ్లు నగరవాసులకు ఎక్కువ సమయం అందుబాటులో ఉండేలా టైం టేబుల్స్‌ను మారుస్తున్నామని, ప్రయాణికుల నుంచి ఇచ్చే డిమాండుకు అనుగుణంగా మార్పులు ఉంటాయని అధికారులు తెలిపారు. మూడు కారిడార్లలోని టర్మినల్ మెట్రో స్టేషన్ల నుంచి మెట్రో రైళ్లు ఉదయం 5.30 నుండి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.