Home తెలంగాణ తుంగతుర్తి మండలంలో రుణమాఫీ చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గిరిజనులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

తుంగతుర్తి మండలంలో రుణమాఫీ చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గిరిజనులు – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
తుంగతుర్తి మండలంలో రుణమాఫీ చేసినందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గిరిజనులు - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • 2 లక్షల రుణమాఫీ కార్యాలయంలో ఇంటింటికి ప్రచారం చేయించారు కాంగ్రెస్ శ్రేణులకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అన్నపర్తి జ్ఞానసుందర్ పిలుపు

తుంగతుర్తి ముద్ర:- రాష్ట్రంలో రెండు లక్షల రూపాయల వ్యవసాయ రుణాలను ఏకకాలంలో మాఫీ చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నపర్తి జ్ఞాన సుందరన్నారు .ఆదివారం మండల పరిధిలోని బాపన్ బాయి తండాలో అన్నపర్తి జ్ఞాన సుందర్ ఆధ్వర్యంలో గిరిజనులు ముఖ్యమంత్రి రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మరే రాష్ట్రంలో 2 లక్షల రూపాయల పంట రుణాలను మాఫీ చేసిన దాఖలాలు లేవని గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను మోసం చేసింది తప్ప మాఫీ చేయలేదని అన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా రైతులకు ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ జరుగుతుందని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ కన్నా ముందుగానే రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించడం జరిగింది.గత పాలకులు కొద్దిమందికి మాత్రమే రుణమాఫీ ప్రకటించారు కూడా నాలుగు దఫాలుగా ప్రకటించారు .వేల కోట్ల రూపాయల భారం పడుతున్న రైతులను ఆదుకోవాలని తపనతో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని అన్నారు .కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఇంత సాహసోపేతమైన నిర్ణయాన్ని గ్రామ గ్రామాన ఇంటింటికి తీసుకువెళ్లాలని రుణమాఫీ అయిన రైతులతో పాటు ప్రజలకు తెలియపరచాలని అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో రైతు సంబరాలు జరపాలని అన్నారు .ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ నిధి 10 లక్షల పెంచడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కూడా అసెంబ్లీలో చర్చించి అందరి ఆమోదంతో అమలు చేయడం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీ సాధిస్తుందని ఆ దిశగా నాయకులు కార్యకర్తలు పని చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బాపన్ భాయ్ తండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

రెండు లక్షల రుణ మాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్ర పటానికి జోరుగా కురుస్తున్న వర్షం లో పాలాభిషేకం.

గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేసింది. నాటి ప్రభుత్వ ఆర్థిక విద్వంసం వలన నేటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. అయినప్పటికీ ఏకకాలంలో రెండు లక్షల రుణ మాఫీ చేసిన చరిత్ర భారతదేశ దేశంలో కేంద్ర ప్రభుత్వం లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదు . 2014లో లక్షరూపాయలు రుణ మాఫీ ప్రకటించిన కెసిఆర్ 25 వేల చప్పున నాలుగు దఫాలుగా ఇవ్వడం జరిగింది. దీని వలన రైతులకు వడ్డీలు కట్టడానికి సరిపోయింది. కానీ రెండు లక్షల రుణ మాఫీ చేయడం వలన ప్రభుత్వం పై 31 వేల కోట్ల భారం పడుతుంది. భారమైన బాధ్యత బాధ్యత తీసుకోవడం చరిత్రలో నిలిచిపోతుంది. మరో 20 సంవత్సరాలు రెండు లక్షల రుణ మాఫీ గురించి చర్చించడం ఖాయం. రేషన్ కార్డులు ఉన్నా లేకున్నా రుణ మాఫీ జరుగుతుందని ముఖ్యమంత్రి మంత్రి గారు ప్రకటించారు.2018 లో కెసిఆర్ ప్రభుత్వం లక్ష రూపాయలను ప్రకటించింది. కెసిఆర్ ప్రభుత్వంలో అందరి రైతులకు రుణమాఫీ అందలేదు . నాటి ప్రభుత్వంలో అందని రైతుల కూడూ దాదాపుగా రూ 8,751 వేల కోట్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది.రైతు భరోసా పై కూడా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకోని అవికూడా చెల్లించడం జరుగుతుంది.

ఆరోగ్యం శ్రీ 10 లక్షల వరకు పెంచడం జరిగింది.ఉచిత బస్ సౌకర్యం,500 వరకే గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి రెండు వందల యూనిట్ కరెంట్ మాఫీ ఆరు గ్యారెంటీలను మాఫీ చేశామని చెప్పడం సంతోషంగా ఉంది. రైతుల మహిళలు ఆశీర్వాదం తో 2029 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.రైతులకు రుణమాఫీ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే 62814 92368 నెంబర్ ఫోన్ చేయండి.కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎన్నికల వేల ఓటర్లు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడిగినాము ఇపుడు ఇంటింటికీ వెళ్లి రైతు రుణ మాఫీ గురించి చెప్పాలని గౌరవ ముఖ్యమంత్రి లెక్కలు. అందుకే ప్రతి గ్రామంలో రైణ మాఫీ సంబరాలు చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అన్నెపర్తి జ్ఞాన సుందర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు మంగమ్మ, కమల ,పట్టు శ్రీనివాస్ నిర్వహించారు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech