Home తెలంగాణ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
  • వరద ప్రవాహాల వద్దకు వెళ్లి సెల్ఫీ ఫొటోస్ కోసం వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దు.
  • అత్యవసర సమయంలో 100 కు ఫోన్ చేసి సహాయం పొందాలి.
  • సన్ ప్రీత్ సింగ్, ఎస్పీ సూర్యాపేట.

సూర్యాపేట ముద్ర ప్రతినిధి:- అధిక వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు, రైతులు, వాహనదారులు, ప్రయాణికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సూర్యాపేట జిల్లా అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశామని తెలిపారు. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించి సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించామని చెప్పారు. ఏదైనా అత్యవసరమైతే స్థానిక పోలీసులకు, డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు సేవను పొందవచ్చని సూచించారు. నీటి ప్రవాహం వద్దకు సెల్ఫీ ఫొటోస్ కోసం వెళ్ళవద్దనీ , ప్రమాదాల బారిన పడొద్దనీ హితవు పలికారు.

అధిక వర్షాల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

– శిథిలావస్థకు వచ్చిన నివాసాలలో ఉండవద్దు.
– చేపల వేటకు వెల్లవొద్దు.
– చెరువులు, వాగులు వద్దకు వెళ్ళవద్దు.
– వాతావరణం తడిగా ఉన్నందున కరెంట్ స్థంభాల వద్దకు వెళ్ళవద్దు. సాధారణ ప్రజలు కరెంట్ రిపేర్ పనులు చేయవద్దు.
– యువకులు సరదాకోసం వాగులు, చెరువులు, బావులు, నదులు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లవద్దు.
– వర్షం తీవ్రత ఉన్నందున పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
– ప్రయాణ సమయంలో వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి, రోడ్లపై వర్షం నీరు చేరడం వల్ల వాహనాలు అదుపుతప్పి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది., వాహనాలు వేగంగా నడపవద్దు. వర్షం పడే సమయంలో ప్రయాణాలు చేయకుండా వీలైతే వాయిదా వేసుకోవాలి.
– జాతీయ రహదారి (NH65) పై వాహనదారులు నెమ్మదిగా వెళ్ళాలి.
– వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తగా ఉండాలి.
– పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech