- శిథిలావస్థలో ఉన్న ఇండ్లను అధికారులు గుర్తించాలి
- చెరువు కట్టలు తెగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
- జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాలు నిర్విరామంగా కురుస్తున్నాయని, రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు పడుతున్నందున రెవిన్యూ మరియు అత్యవసర శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోషం వ్యక్తం చేశారు. హెచ్చరికలు జారీ నేపథ్యంలో రానున్న మరో రెండు రోజులు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున, నిరంతర వర్షాల కారణంగా జిల్లాలో ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
నాగర్ కర్నూల్ నిర్మిత చెరువు కట్టలు తెగిపోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఆర్డీవోలు, తాసిల్దార్లు, అధికారులు క్షేత్రస్థాయిలో శిథిలావస్థలో ఉండి శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి అందులో ఉన్న ప్రజల సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు చర్యలు చేపట్టాలన్నారు. చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. వర్షాలు కురుస్తున్నందున దోమలు, వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో ప్రతి శుక్రవారం డ్రైడేను నిర్వహించి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామాలలో తాగునీరు వర్షాల కారణంగా కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. పైప్ లైన్ లీకేజీలు వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. ముఖ్యంగా ప్రజలు శిథిలావస్థలో ఉండి కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఇండ్లలో ఉండేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నేడు ఒక ప్రకటనలో సూచించారు.._