ముద్ర.వీపనగండ్ల:- ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చెప్పి మొదటి విడతగా రూ. లక్ష లోపు రుణమాఫీ చేసి రైతన్నకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం అని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండల పరిధిలోని సంగినేనిపల్లిలో శుక్రవారం రుణమాఫీ సంబరాలలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి రుణమాఫీతో పండగ జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంత్రి జూపల్లి క్షీరాభిషేకం చేశారు.వ’రంగ గాంధీల్ రైతు డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చార’ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజాప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని, ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రుణమాఫీతో రైతులు అప్పుల భారం నుంచి బయటపడుతారని అన్నారు. రుణమాఫీ బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే సాధ్యం కాలేదన్నారు.ఇచ్చిన మాటకు క’ట్టుబడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేశారన్నారు.అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం.. మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ 10 లక్షలకు పెంచడం, గృహ జ్యోతి ప’థకం ద్వారా 200 యూనిట్లు అమల్లోకి ఉచిత కరెంట్, 500 రూపాయలకు చేశామని వివరించారు.
- పాఠశాల ఆకస్మిక తనిఖీ
సంగినేనిపల్లి ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు,ఎన్ని తరగతులకు ఎంతమంది ఉపాధ్యాయులు ఎంతమంది విద్యార్థులు ఉన్నారని తెలుసుకున్నారు. బదిలీపై వెళ్లే ఉపాధ్యాయులను అప్పుడే రిలీవ్ చేయవద్దని, కొత్త ఉపాధ్యాయులు వచ్చిన తర్వాతనే బదిలీ చేయాలని ఎంఈఓ లక్ష్మణ్ నాయక్ కు సూచించారు.అనంతరం విద్యార్థులతోనూ మాట్లాడారు. విద్యా బోధన ఎలా ఉంది.. మధ్యాహ్న భోజనం బాగుంటుందా.. అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చక్కగా పాఠాలు విని మంచి మార్కులు సాధించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు.
ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని చెప్పారు.మంత్రి జూపల్లి మాట్లాడుతూ…. ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు చదువుకోవాలని ఉద్దేశంతో ప్రభుత్వ సౌకర్యాల కల్పన కోసం తాగునీరు, విద్యుత్, బాలికల టాయిలెట్ సుందరీకరణ పనులు చేపట్టామని తరువాత పంచాయతీ మహిళా సంఘము సభ్యులతో మాట్లాడారు. గ్రామానికి 50 ఇందిరమ్మండ్లను అందించడం జరిగింది.కార్య క్రమంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోదల బీరయ్య, జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు ఇంద్రకంటి వెంకటేష్, రైతుబంధు సమితి మండల మాజీ అధ్యక్షులు ఎత్తం కృష్ణయ్య, నారాయణరెడ్డి,పాన్ గల్ విండోస్ మాజీ అధ్యక్షుడు బాల్ రెడ్డి,మాజీ సర్పంచ్ వనస్కర్ రెడ్డి, నాయకులు బొల్లారం సుదర్శన్ రెడ్డి, రఘునాథరెడ్డి, రామిరెడ్డి, చిన్నారెడ్డి, ధనుంజయుడు, మీసాల మోహన్,లక్మన్ ఉన్నారు.