- తుంగతుర్తి మండలం వెలుగు పల్లి రుద్రమ చెరువు పక్కన సుమారు 200 ఎకరాల ప్రభుత్వ స్థలంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి
- ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి పారిశ్రామికంగా అనేక పరిశ్రమల యాజమాన్యాలతో చర్చించండి
- పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు పరిశ్రమల ఏర్పాటుకు నివేదిక సమర్పించారు
- రుద్రమ చెరువు రిజర్వాయర్ కోసం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి ప్రతిపాదనలు ఇచ్చా
- తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్
తుంగతుర్తి ముద్ర:- తుంగతుర్తి నియోజకవర్గం గత ప్రభుత్వాల హయాంలో వెనుకబాటు తనంలోకి వెళ్లిందో లేఖ వెనుక తనానికి నెట్టబడిందో తెలియదు కానీ నియోజకవర్గ అభివృద్ధి మాత్రం గతంలో ఏమాత్రం జరగలేదని తుంగతుర్తి శాసనసభ్యుడు మందుల సామెల్ అన్నారు. మంగళవారం తుంగతుర్తి మండలం వెలుగుపల్లి శివారులోని రుద్రమ చెరువు పక్కనే ఉన్న సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశ్రమల స్థాపనకు ఉపయోగ పడుతుందా అనే విషయాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ భూమిని పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబాటుతనంలో ఉంది అని గడచిన పది సంవత్సరాలుగా నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని అన్నారు. గత పాలకులు రుద్రమ చెరువును రిజర్వాయర్‌గా మారుస్తామని చెప్పి ఓట్లు దండుకొని ప్రజలను మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు పోటీ చేసే అవకాశం ఇచ్చిందని ప్రజలు 50వేల ఓట్ల పైచిలుకు మెజార్టీతో తనను గెలిపించారని ప్రజలు తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయనని ఎమ్మెల్యే అన్నారు. తుంగతు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేసి ఎమ్మెల్యే తెలిపారు. రుద్రమ చెరువు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో పరిశ్రమల స్థాపనకు యోగ్యంగా ఉంటుందని ఈ ప్రాంతంలో దాదాపు రెండు వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవుతుందని అన్నారు.
తుంగతుర్తి ప్రాంతంలో పరిశ్రమలు లేక అభివృద్ధి శూన్యంగా ఉందని అన్నారు. పరిశ్రమల స్థాపన కోసం ఆ శాఖ మాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఇటీవలే కలిశానని ఆయనకు నియోజకవర్గ పరిస్థితి వివరించానని మంత్రి పరిశ్రమ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారని అన్నారు. పలు పరిశ్రమల యజమానులతో సైతం మాట్లాడానని ప్రభుత్వ స్థలం ఉంటే పరిశ్రమలు నెలకొల్పడానికి సిద్ధమేనని పరిశ్రమల యాజమాన్యాలు తెలిపాయని అన్నారు. ఈ మేరకు రుద్రమ ఉన్న సుమారు 20 ఎకరాల స్థలంలో పరిశ్రమల ఏర్పాటుకు తన వంతు కృషి చేయాల్సిన చెరువు ఎమ్మెల్యే పక్కనే ఉన్నారు. ఈ పరిశ్రమలు వస్తే నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు .పరిశ్రామికంగా అభివృద్ధి చెందితే నియోజకవర్గంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయని నియోజక వర్గం నేడు అభివృద్ధి పరంగా వెనుకంజలో ఉన్న పరిశ్రమలు ఏర్పాటు అయితే నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. అదేవిధంగా తుంగతుర్తి మండలంతో పాటు నూతనకల్‌తో పాటు పలు వ్యవసాయ భూములకు సాగునీరు అందించడానికి రుద్రమ చెరువు రిజర్వాయర్‌గా మార్చేందుకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డితో ఇటీవలనే సంప్రదించామని మంత్రి సానుకూలంగా స్పందించారు.
సుమారు 16 వేల ఎకరాల సాగుభూమికి నీరందుతుందని ఎమ్మెల్యే అన్నారు. తుంగతుర్తి ప్రాంతంలో పారిశ్రామికంగా అటు వ్యవసాయపరంగా అభివృద్ధి చేయడానికి తాను శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. అలాగే నియోజకవర్గంలోని ప్రతిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుకు అలాగే నియోజకవర్గ కళాశాల డిగ్రీ కళాశాల ఏర్పాటుకు తన వంతు కృషి చేసి మండలం ఎమ్మెల్యేగా చేరారు. ఇప్పటికే అదేవిధంగా నియోజకవర్గంలో 13 కోట్ల రూపాయలతో గ్రామాల్లో సిసి రోడ్లు నిర్మించామని అదేవిధంగా కోట్లాది రూపాయల వ్యయంతో పలు గ్రామాలకు లింక్ రోడ్లు వేసామని అన్నారు.
తుంగతుర్తి నేషనల్ హైవే నుండి రావులపల్లి వరకు 16 కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మాణం జరిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు .వెలుగుపల్లి నుండి కాశి తండకు వెళ్లే రోడ్డును మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టారు ఎస్సారెస్పీ కాలువలకు లైనింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రుద్రమ చెరువుకు గోదావరి జలాలు వచ్చే కాలువ దాదాపు రెండు ప్రాంతాలు తవ్వాల్సి ఉందని అది కూడా పూర్తి చేయాలని అన్నారు .త్వరలో తుంగతుర్తి క్యాంప్ ఏర్పాటు వారానికి రెండు రోజులు ఉండి ఈ ప్రాంత ప్రజల సమస్యలు తెలుసుకుంటానని వారి విన్నపాలు స్వీకరిస్తానని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
తుంగతుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమని రానున్న రెండు మూడు సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్ డి సిసిబి డైరెక్టర్ సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, ఇంచార్జి తాసిల్దార్ కండ్లమయ్య, కాంగ్రెస్ నాయకులు ఓరుగంటి సత్యనారాయణ , నల్లు రామచంద్రారెడ్డి ,దాయం ఝాన్సీ రెడ్డి, పెద్దబోయిన అజయ్ కుమార్, కొండ రాజు, ఎస్సీ సెల్ నాయకుడు శంకర్ లతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.