Home తెలంగాణ గుడ్‌న్యూస్.. పంటల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

గుడ్‌న్యూస్.. పంటల రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన...



రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. తెలంగాణలో భూమి కలిగివున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల వరకు పంట రుణ మాఫీ వర్తిస్తుంది. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకులు (ఉమ్మడిగా “బ్యాంకులు” అని పిలుస్తారు) వాటి బ్రాంచ్ నుంచి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది.

దీని ప్రకారం. 12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరయిన లేక రెన్యువల్ అయిన రుణాలకు, 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంటరుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద ప్రతి రైతుకుటుంబం, 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు. 09-12-2023 తేదీ నాటికి బకాయి ఉంది, వర్తింపయ్యే వడ్డీ అసలు మొత్తం పథకానికి అర్హత ఉంటుంది.రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌరసరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు (పిడిఎస్) డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. అటువంటి కుటుంబంలో, ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు ఉంటారు.

  • వ్యవసాయశాఖ కమిషనర్, సంచడు పంట రుణమాఫీ 2024 అమలుకు అధికారిగా ఉంటారు
  • హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌ఫర్మేటిక్స్ సెంటర్ (ఎస్ఐఐసి) ఈ పథకానికి బటి భాగస్వాముల బాధ్యతలను నిర్వర్తించారు
  • వ్యవసాయశాఖ సంచాలకులు, ఎస్బీసీ సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటి పోర్టల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ పోర్టల్ లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వాలిడేషన్, అర్హత నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఐటి టల్‌లో ఆర్థికశాఖ నిర్వహించే ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్ కి బిల్లులు సమర్పించడం, ఈ పథకానికి సంబంధించిన పోర్టల్‌లను పంచుకోవడానికి, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన మాడ్యూల్స్ ఉంటాయి.
  • ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా (BIS) నియమించాలి. ఈ బ్యాంకు నోడల్ అధికారులు బ్యాంకులకు వ్యవసాయశాఖ సంచాలకులు, ఎస్ఐసీ మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. బ్యాంక్ నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంక్ పంటరుణాల డేటాను డిజిటల్ సంతకం చేయాలి.
  • ప్రతి బ్యాంక్ తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సిబిఎస్) నుండి రిఫరెన్స్- 1వ మెమో, ప్రతి బ్యాంక్ తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సిబిఎస్) నుండి రిఫరెన్స్-1వ మెమో, జత చేసినట్టి ప్రొఫార్మా-1లో డిజిటల్ సంతకం చేసిన సంక్షిప్తిని ప్రభుత్వానికి సమర్పించాలి
  • ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సిబిఎస్ లేవు. కాబట్టి, పిఎస్‌ఎస్‌కు అనుబంధమైన బ్యాంక్ బ్రాంచ్, రిఫరెన్స్ – 2వ మెమో, జత చేసినట్టి ప్రొఫార్మ్-2లో డేటాను డిజిటల్ సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి
  • ప్రతి బ్యాంకు సిబిఎస్ నుండి సేకరించిన డేటాను యథాతథంగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియ ఉద్దేశం తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడం, అవసరమైతే వ్యవసాయశాఖ సంచాలకులు, ఎన్బసి డేటా, వాలిడేషన్ తనిఖీలను చేపట్టాలి.
  • ఈ పథకం కింద లబ్ధిదారులు, రైతుకుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణఖాతలోని ఆధార్ ను పాస్ బుక్ డేటా బేస్ లో ఉన్న ఆధార్ తో, పిడిఎస్ డేటాబేస్ లో ఉన్న ఆధార్ తో మ్యాప్ చేయాలి. ఈ విధంగా గుర్తించబడ్డ ఒక్కో రైతు కుటుంబానికి 09-12-2023 నాటికి బకాయి ఉన్న సంచిత (క్యుములేటివ్) రుణమాఫీ రూ.2.00 లక్షల వరకు పరిమితి వర్తిస్తుంది
  • అర్హతగల రుణ మాఫీ డిబిటి పద్ధతిలో నేరుగా లబ్దిదారుల రైతు రుణఖాతాలకు జమచేయబడుతుంది. పిఏసిఎస్ విషయంలో రుణమాఫీ డిసిసిబి లేదా బ్యాంకు బ్రాంచికి విడుదల చేయడమవుతుంది. ఆ బ్యాంకు వారు రుణమాఫీ కలిగి పిఎస్‌ఎస్‌లో ఉన్న రైతు ఖాతాలో జమచేస్తారు
  • ప్రతి రైతు కుటుంబానికి 09-12-2023 తేదీ నాటికి ఉన్న రుణమొత్తం ఆధారంగా రుణమాఫీ కలిగి జమచేయాలి
  • ప్రతి రైతుకుటుంబానికి 09-12-2023 నాటికి కలిగిఉన్న మొత్తం రుణం కానీ లేక రూ.2.00 లక్షల వరకు ఏది తక్కువ అయితే ఆ రైతు కుటుంబం పొందే అర్హత ఉంటుంది
  • ఏ కుటుంబానికి అయితే రూ.2.00 లక్షలకు మించిన రుణం ఉంటుందో, ఆ రైతులు రూ.2.00 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఆ తరువాత, అర్హతగల రూ. 2.00 లక్షల రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు
  • రూ. 2.00 లక్షల కంటే ఎక్కువ రుణం వున్న పరిస్థితులలో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి, మిగిలిన దామాషా పద్దతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలను మాఫీ చేయాలి
  • ఈ రుణమాఫీ ఎన్‌హెచ్‌సీలు, జెఎల్‌సీలు, ఆర్ఎంజిలు, ఎల్‌ఎస్‌ఎస్‌లకు తీసుకున్న రుణాలకు వర్తించదు
  • ఈ రుణమాఫీ పునర్వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూలు చేసిన రుణాలకు వర్తించదు
  • కంపెనీలు, ఫరస్ట్ వంటి సంస్థలకి ఇచ్చిన పంటరుణాలకు వర్తించదు. కానీ పిఏసిఎస్ల ద్వారా తీసుకున్న పంటరుణాలకు
  • కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పిఎం- కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లంగా వున్నంత మేరకు ఆచరణాత్మకంగా అమలు చేయడం చాలా వరకు పరిగణలోకి తీసుకోబడుతుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech