Home తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • మతోన్మాదం నుండి ప్రజలను రక్షించండి
  • ప్రజా సమస్యల పరిష్కారానికై ఉద్యమించండి
  • సిపిఎం రాష్ట్ర నాయకులు జాన్ వెస్లీ, జబ్బార్

ముద్రణ,పానుగల్ :-కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాన్ వెస్లీ, సిపిఎం కార్యదర్శి ఎండి జబ్బార్ లు అన్నారు. స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మూడవసారి అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఏమీ లేదు.

బిజెపి పాలనలో మతతత్వ రాజకీయాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడం తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమి లేదని వారు అన్నారు.బిజెపి పాలనలో అధికార శక్తులకు రాయితీలు ఇవ్వడమే తప్ప, సామాన్య ప్రజలకు రైతులకు,కూలీలకు వ్యతిరేకంగా బిజెపి పాలన కొనసాగుతుందని అన్నారు.రైతులకు వ్యతిరేకంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకురావడం వల్ల కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. అందుకోసమే బిజెపి ఎక్కువ స్థానంలో ఓడిపోయిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలను కొనసాగిస్తామన్నారు.

ప్రజల కోసం ప్రజల కోసం వాగ్దానం చేస్తున్నప్పుడు అన్ని ప్రజా సంఘాలు,కార్మిక సంఘాలు ఐక్యపరుస్తూ బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి రూపకల్పన చేస్తున్నామని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను కచ్చితంగా అమలు చేయాలని, దళితులు గిరిజనులు, బీసీలు మైనార్టీ, సామాజిక వర్గాలపై దాడులను అరికట్టాలని,కనీసం విద్యా వైద్యం ప్రాథమిక దాడులు సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వాని డిమాండ్ చేశారు. స్థానిక సీపీఎం పార్టీ ఘన విజయాలు సాధించేలా,ప్రజల కోసం పనిచేసే ఎర్రజెండా పార్టీని గెలిపించాలని నిర్ణయించారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు బాల్య నాయక్, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బాల్ రెడ్డి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సూర్యవంశం రాము,మండల నాయకులు వెంకటయ్య.భీమయ్య,వెంకటయ్య,,నిరంజన్,అంజనేయులు,బాబు నాయక్,శేఖర్ యాదవ్,నాయకులు ఉన్నారు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech