- రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ముద్ర.వనపర్తి:- రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని పంటసహాయం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం స్వయంగా రైతుల నుండి తీసుకోడానికి క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు రైతుల ముందుకు వచ్చారని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.క్యాబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా అభిప్రాయ సేకరణలో భాగంగా శుక్రవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులతో వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయాలు సముదాయం సమావేశ మందిరంలో వర్క్ షాప్ జరిగింది.ఇట్టి కమిటీ సభ్యులైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్న, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు, ఉమ్మడి జిల్లా శాసన సభ్యులు సభ్యులు, జిల్లాలతో కలెక్టర్లు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికినీ వ్యవసాయ రంగాన్ని, చిన్న, సన్నకారు రైతులను కాపాడేందుకు, రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నారు. అయితే ఇది రైతు ప్రభుత్వం కాబట్టి రైతు భరోసా ఏ విధంగా అమలు చేయాలి, ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి కౌలు రైతులకు ఏ విధంగా న్యాయం చేయాలి అనే అంశాలను స్వీకరించి, శాసన సభలో పెట్టి అందరి ఆమోదంతో రైతుల విధివిధానాలు ఖరారు చేయడం జరుగుతుందన్నారు.
రాష్ట్ర వనరులు, సంపదను ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తాం, ప్రజలు, రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ కష్టార్జితం నుంచి చెల్లించిన పన్ను, వివిధ రంగాల ద్వారా ప్రభుత్వానికి అందించిన ఆదాయం ద్వారా ప్రజల కష్టానికి న్యాయం జరిగింది. రైతు భరోసా పథకం ద్వారా రైతు సంక్షేమం కోసం స్పష్టమైన కార్యచరణతో ముందుకు వెళతామని అన్నారు.రైతు పథకంలో రైతులకు లబ్ధి చేకూర్చే రైతులు, శాస్త్రవేత్తలు, వివిధ రంగాలలో నిపుణులు, వివిధ వర్గాల వారి అందరి అభిప్రాయాలు, సూచనలను తీసుకొని రైతు సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ దిశగా ప్రజా రంజకంగా పాలన సాగడం జరుగుతుందని, చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే విధంగా రైతు భరోసా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ క్షేత్రంలో కష్టాలకు ఓర్చి, చెమటోడ్చి పంట పండించే రైతులకు ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న మరో కమిటీ సభ్యుడు రాష్ట్ర, సమాచార పౌర సంబంధాలు, హాజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాజును చేయాలనే చిత్తశుద్ధితో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది.
రైతు భరోసాను ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుందో రైతులనే అడిగి తెలుసుకునేందుకు, రైతుల అందరి అభిప్రాయానికి అనుగుణంగా రైతు భరోసా పై తుది నిర్ణయం తీసుకుంటారు. వంద ఎకరాల భూస్వాములకు, పోరంబోకు, కొండలు, గుట్టలు, లే అవుట్లు అయిన వాటికి సైతం రైతు భరోసా ఇవ్వకూడదని మీ అభిప్రాయం చెప్పాల్సిందిగా రైతులను కోరారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రైతుల అభిప్రాయం మేరకు రూపొందించాలని రైతు భరోసా సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 10 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులు 90 శాతం మంది ఉన్నారని వారందరికీ రైతు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎవరైతే ఆర్థికంగా బాగున్నారో అలాంటి రైతులు స్వచ్ఛందంగా రైతుభరోసా వదులుకోవాలని సూచించారు.అనంతరం రైతుల అభిప్రాయాలను మండలాల వారిగా, జిల్లాల వారిగా అడిగి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.ఇందులో అత్యధిక మంది రైతులు ఒక కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకొని వాటికి 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని సూచించారు.
కష్టపడి పంట పండించే రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి తప్ప వందల ఎకరాలు ఉన్నవారికి, ఇప్పటికే వెంచర్లు అయిన వాటికి, కొండలు, గుట్టలకు, ఇంకం ట్యాక్స్ పరిధిలో ఉన్న రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది.కౌలు రైతులకు కూడా రైతులకు కూడా భరోసా ఇవ్వాలన్నారు. యంత్రాలు అందించే విధంగా రైతు భరోసాతో పాటు పంటకు అదనంగా బోనస్ చెల్లించాలని కొందరు రైతులు కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. మరికొంత మంది రైతులు మాట్లాడుతూ రైతు భరోసాకు బదులుగా పంట గిట్టుబాటు ధరకు అదనంగా బోనస్ చెల్లిస్తే రైతులు వ్యవసాయంపై ఎక్కువ దృష్టి పెడతారని సూచించారు. కమిటీలో రైతులు ఇచ్చిన సలహాలు, సూచనలు శాసన సభలో పెట్టి చర్చించి, చట్ట సభ ద్వారా తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనీ కమిటీ సభ్యులు అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడానికి కృషి చేస్తానని చెప్పారు. ఒక కుటుంబంలో 10 ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు భరోసా ఇచ్చారు. స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, నాగర్ కర్నూల్ శాసన సభ్యులు కే. రాజేష్ రెడ్డి, అచ్చంపేట నుండి వంశీకృష్ణ, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, గద్వాల నుండి కృష్ణ మోహన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, మహబూబ్ నగర్ కలెక్టర్లు విజయేంద్ర బోయి, వనపర్తి కలెక్టర్ సంచిత్ గంగ్వార్, కలెక్టర్ బాదావత్ సంతోష్, నారాయణ పేట కలెక్టర్ సీక్త పట్నాయక్, అదనపు కలెక్టర్లు, రైతులు, రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహించారు.