సూరత్: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఒక ఆరు అంతస్థుల భవనం శనివారం మధ్యాహ్నం కూలిపోయింది. ఆ భవనం శిథిలాల కింద నివాసితులు చిక్కుకుని వున్నట్టుగా. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక దళాధికారులు అక్కడికి చేరుకున్నారు. ఒక మహిళను వారు రక్షించారు. పోలీసులు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సాలిగామ్ లోని డీఎస్ నగర్ సొసైటీలో ఈ ప్రమాదం సంభవించింది. చోర్యాసీ శాసనసభ్యుడు సందీప్ దేశాయ్, సూరత్ పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గహ్లౌట్, జిల్లా కలెక్టర్ సౌరభ్ పార్థి, మున్సిపాల్ కార్పొరేషన్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అగ్నిమాపక దళాధికారి బసంత్ పారిక్ అక్కడ శిథిలాల తొలగింపు, ఇతర రక్షణ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. రాత్రి కూడా సహాయక కార్యక్రమాలు చురుగ్గా కొనసాగించేందుకు వీలుగా ఆ ప్రాంతంలో ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. కూలిన ఈ భవనంలో ఎక్కువ మంది జౌలి కార్మికులు ఉన్నారని సమాచారం. 15 మంది గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం ఐదంతస్తుల భవనం కుప్పకూలడంతో చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. సూరత్‌లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక శాఖ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ది… pic.twitter.com/b3o6OFjcOg
— ఇండియాటుడే (@IndiaToday) జూలై 6, 2024