Home తెలంగాణ ఆగష్టు 15 లోగా రెండు లక్షల రుణమాఫీ : రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

ఆగష్టు 15 లోగా రెండు లక్షల రుణమాఫీ : రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
ఆగష్టు 15 లోగా రెండు లక్షల రుణమాఫీ : రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఆగష్టు 15 లోగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు.

గురువారం యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆయన కార్యాలయ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహానికి, తెలంగాణ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, స్వామి వివేకానంద వర్ధంతి, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జన్మదినం పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు ప్రజాప్రతినిధులుగా బాగా పనిచేశారని సభ్యులను అభినందించారు. అభివృద్ది కార్యక్రమాలలో భాగంగా జిల్లా బైపాస్ పనులు 40 కోట్లతో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పదవి ప్రజల కోసమని, ప్రజల కోసం మనమంతా పనిచేయాలని, ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా వుండాలని అన్నారు. యాదగిరిగుట్ట ఆటోల సమస్యల పరిష్కారానికి గుట్ట పైకి అనుమతించి ఆటోలకు జీవన భృతి కల్పించడం జరిగిందని, యాదగిరిగుట్టలో షాపులు పోయిన వారికి, భూములు ఇచ్చిన వారికి న్యాయం జరుగుతుందని, యాదగిరిగుట్ట క్షేత్రాన్ని ఇంకా అభివృద్ది చేసి ప్రజలకు, వ్యాపారులకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రిని ఆహ్వానించి యాదగిరిగుట్ట క్షేత్ర అభివృద్ది పనులను సమీక్షించారు.

భువనగిరి, ఆలేరు నియోజక వర్గాలకు సంబంధించి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫర గురించి నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తేవడం జరిగింది. సెప్టెంబరు చివరి లోగా 210 కోట్లతో ప్రతి గ్రామానికి గోదావరి నీళ్లను మిషన్ భగీరథ ద్వారా అందజేసినట్లు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో బస్వాపూర్ రెండు పూర్తి, టెండర్లను పిలవబోతున్నట్లు చెప్పారు. రైతాంగానికి మేలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశంలో చెప్పిన విధంగా ఎన్ని ఆటలు వచ్చినా ఆగష్టు 15 లోగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. త్రాగునీటి, మురికి కాలువలకు సంబంధించి ఏ సమస్య వచ్చినా నాకు గానీ, ప్రజాప్రతినిధులకు గానీ మెసేజీలు పంపినా అధికారుల సమన్వయంతో పరిష్కరించడం జరుగుతుందన్నారు.

ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బీర్ల అయిలయ్య మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా పార్టీలకతీతంగా ప్రజలకు ప్రభుత్వ స్థానిక సంస్థల ప్రతినిధులు వారథిగా పనిచేశారని, జిల్లా మంత్రి ప్రతినిధులందరి భాగస్వామ్యంతో ఇంకా అభివృద్ది పనులు చేసుకుందామన్నారు. భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పదవీ కాలం పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులందరికీ వారి పదవీ కాలంలో అనేక అభివృద్ది పనులు తెలియజేస్తూ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ శీలం, జడ్పీటీసీ అనూరాధ, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech